13 July, 2026 | 9:38 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

ఎస్సీ, ఎస్టీ కేసుల పరిష్కారానికి కృషి చేయాలి

26-03-2026 01:46 AM

కలెక్టర్ దివాకర టి.ఎస్..

ములుగు, మార్చి25 (విజయక్రాంతి): ఎస్సీ, ఎస్టీ కేసులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ త్వరితగతిన పరిష్కారానికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్. సంభందిత కమిటీ సభ్యులకు,పోలీస్ అధికారులను ఆదేశించారు.బుదవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్.ఏఎస్పి మనన్ భట్,అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంపత్ రావులతో కలిసి ఎస్సీ,ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం ఏర్పాటు చేసి కమిటీ సభ్యులతో సమీక్షించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో నమోదైన అట్రాసిటీ కేసులు,పరిష్కరించిన కేసులు,బాధితులకు అందిన పరిహారం గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.  ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వివిధ సమస్యలపై జిల్లా స్థాయి ఎస్సీ,ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యులు అందించిన వివరాలు పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.సభ్యులు తెలిపిన సమస్యల్లో జిల్లా స్థాయిలో ఉన్న సమస్యలు ఇక్కడే త్వరగా పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. 

బ్యాంకు రుణాల మంజూరు వేగవంతం చేయాలి

ములుగు,మార్చి25 (విజయక్రాంతి): జిల్లాలోని అర్హులైన ప్రతి ఒక్కరికీ రుణాల మంజూరు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్, ఐటీడీఏ ఇంచార్జ్ ప్రాజెక్టు ఆఫీసర్ దివాకర టి.ఎస్ సంబంధిత బ్యాంకర్లను ఆదేశించారు. బుధవారం ఎటునాగారం ఐటీడీఏ సమావేశ మందిరంలో వివిధ బ్యాంకు అధికారులతో కలెక్టర్ సమావేశాన్ని నిర్వహించారు. వివిధ ప్రభుత్వ పథకాలకు మంజూరైన రుణాల పురోగతిని సమీక్షించారు.

వ్యవసాయం, విద్య, స్వయం ఉపాధి రంగాలకు బ్యాంకర్లు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, జాప్యం లేకుండా అర్హులైన లబ్ధిదారులకు రుణాలు అందజేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. సంక్షేమ పథకాల రుణాలు బ్యాంకుల్లో పెండింగ్లో ఉన్న దరఖాస్తులను వెంటనే పరిశీలించి పరిష్కరించాలని, గ్రౌండింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టం చేశారు. రుణ ప్రణాళికలో నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవడంలో వెనుకబడి ఉన్న బ్యాంకులు తమ పనితీరును మెరుగుపరుచుకోవాలని సూచించారు. జిల్లా ఆర్థికాభివృద్ధిలో బ్యాంకుల పాత్ర కీలకంగా ఉంటుందని సామాన్య ప్రజలకు,రైతులకు బ్యాంకులు అండగా తోడ్పాటును అందించాలని పేర్కొన్నారు.