13 July, 2026 | 9:36 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

పాపారావు లొంగుబాటు

26-03-2026 01:46 AM

ఛత్తీస్‌గఢ్ పోలీసుల ఎదుట మావోయిస్టు అగ్రనేత 18 మంది అనుచరులతో సరెండర్ 

హైదరాబాద్, మార్చి 25 (విజయ క్రాంతి): ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ జిల్లాలో బుధవారం మావోయిస్టు పార్టీ దండకారణ్య ప్రత్యేక జోనల్ కమిటీ సభ్యుడు, మావోయి స్టుల దక్షిణ సబ్ జోనల్ బ్యూరో ఇన్‌చార్జి పాపారావు.. బస్తర్ రేంజ్ ఐజీపీ సుందర్ రాజ్ ఎదుట లొంగిపోయారు. లొంగిపో యిన వారిలో మొత్తం 18 మంది ఉండగా అందులో ఏడుగురు మహిళలు ఉన్నారు. డివిజనల్ కమిటీ సభ్యులు ప్రకాష్ మాద్వి, అనిల్ తట్టి వంటి కీలక నేతలు ఉన్నారు. ఏకే-47 రైఫిళ్లు, ఇతర ఆయుధాలను మావో యిస్టులు పోలీసులకు అప్పగించారు. 

మావోయిస్ట్ శుక్రు లొంగుబాటు

చర్ల: ఈ ఏడాది మార్చి 31 నాటికి దేశంలో వామపక్ష తీవ్రవాదాన్ని నిర్మూలించాలని ఒడిస్సా డీజీపీ వైబీ ఖురానియా అన్నారు. ఒడిశాలో మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ సుక్రు మంగళవారం కంధమాల్ జిల్లాలో పోలీసుల ఎదుట లొంగిపోయారు. తన ఏకే-47 రైఫిల్‌ను కూడా సరెండర్ చేశారు. లొంగిపోయిన వారిలో సుక్రుతో పాటు మరో నలుగురు ఇతర మావోయిస్టు సభ్యులు ఉన్నారని ఒడిశా డీజీపీ వైబీ ఖురానియా వెల్లడించారు. రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఉన్న సుక్రు తలపై రూ.55 లక్షల రివార్డు ఉందని తెలిపారు.

మల్కాన్‌గిరి జిల్లాకు చెందిన సుక్రు.. రాష్ట్రంలో క్రియాశీలంగా ఉన్న మిగతా మావోయిస్టుల్లో ఒకరని పేర్కొన్నారు.ఈ ఏడాది మార్చి 31 నాటికి దేశంలో వామపక్ష తీవ్రవాదాన్ని నిర్మూలించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకున్న డెడ్‌లైన్ సమీపిస్తున్న క్రమంలో తాజా పరిణామం చోటుచేసుకుంది.మరోవైపు ఇప్పటి వరకూ సుక్రు, అతని సహచరులు దాగివున్న కంధమాల్, రాయగడ, కలహండి జిల్లాల సరిహద్దు జంక్షన్ ప్రాంతంలో భద్రతా బలగాలు యాంటీ నక్సల్ ఆపరేషన్లను ముమ్మరం చేశాయని అధికారులు తెలిపారు.