కొత్త రకాల ఉత్పత్తికి కృషి చేయాలి
సంగారెడ్డి, మే 22 (విజయక్రాంతి) : సంగారెడ్డి ఫల పరిశోధన కేంద్రంలో పలు రకాల మామిడి పండ్లును ప్రదర్శనలో ఉంచగా వాటిని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరి తిలకించారు. బుధవారం సంగారెడ్డి పట్టణంలో కొండ లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం ఫల పరిశోదన కేంద్రం వారు మామిడి పండ్ల ప్రదర్శన నిర్వహించారు. ఫల పరిశోధన కేంద్రంలో 400పైగా మామిడి పండ్ల ఉన్నాయని కలెక్టర్‌కు ఉద్యాన శాస్త్రవేత్తలు వివరించారు. కొత్త రకం మామిడి పండ్లు సృష్టించేందుకు శాస్త్రవేత్తలు చేస్తున్న కృషిని అభినందించారు.
పలు రకాల పండ్లను పరిశీలించి వాటి వివరాలు ఆడిగి తెలుసుకున్నారు. సంగారెడ్డి ఎఫ్‌ఆర్‌ఎస్ రాష్ట్రంలో రెండోస్థానంలో ఉందని వివరించారు. 476 మామిడి మొక్కలు ఫల పరిశోధన కేంద్రంలో పెంచమని తెలిపారు. ప్రదర్శనలో 242 మామిడి పండ్ల ఉంచామని తెలిపారు. అధిక దిగుబళడులో దాసరి ముఖ్యమైందన్నారు. మల్లిక లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఫల పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు, ఉద్యాన శాఖ అధికారులు, రైతులు పాల్గొన్నారు.






