20 August, 2026 | 4:57 AM

నిరంతర విద్యుత్‌కు పటిష్ట చర్యలు

23-05-2024 06:52 AM

గజ్వేల్, మే 22 (విజయక్రాంతి): ప్రజావసరాలకు నిరంతర విద్యుత్ సరఫరా అందించేందుకు పటిష్ట చర్యలు చేపడుతున్నట్లు విద్యుత్ శాఖ సిద్దిపేట సర్కిల్ ఆపరేషన్స్ ఎస్‌ఈ మోహన్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన డీఈఈ భానుప్రకాశ్‌తో కలిసి సర్కిల్ పరిధిలోని తున్కిబొల్లారం, వంటిమామిడి, ములుగు, గౌరారం, గజ్వేల్, గజ్వేల్ ప్రజ్ఞాపూర్, కొడకండ్ల 33/11కెవి సబ్‌స్టేషన్లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్‌ఈ మాట్లాడుతూ ప్రజలకు వేసవితో పాటు రానున్న వర్షకాలంలోనూ విద్యుత్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సబ్‌స్టేషన్లు, విద్యుత్ లైన్ల ముందస్తు మరమ్మతులు చేపడుతున్నట్లు చెప్పారు. 

ములుగు,వర్గల్ ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్న పారిశ్రామిక ప్రాంతానికి అవసరమైన విద్యుత్ సబ్‌స్టేషన్‌ను కూడా పూర్తిస్థాయిలో సిద్ధం చేశామని, నిర్మాణంలో ఉన్న పరిశ్రమలకు సబ్‌స్టేషన్ ద్వారా విద్యుత్ సరఫరాను కూడా ప్రారంభించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏఈలు మారుతి, శ్రీనివాస్ పాల్గొన్నారు.