calender_icon.png 12 September, 2025 | 3:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బహుజన రాజ్యస్థాపనకు కృషి చేయాలి

12-09-2025 12:46:33 AM

భద్రాద్రికొత్తగూడెం, సెప్టెంబర్ 11, (విజయక్రాంతి): బహుజన రాజ్యస్థాపనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జైభీమ్ రావ్ భారత్ పార్టీ (జేబీపీ) స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్ అన్నారు. గురువారం పట్టణ కార్యక్రమంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలో 85 శాతానికి పైగా జనాభా ఉన్న బహుజనులు అందరూ ఏకతాటిపైకి రావాలని కోరారు.

అగ్రవర్ణాల కనుసన్నల్లో నడిచే పార్టీల్లో కార్యకర్తలుగా ఉండి, కార్యకర్తలుగా మిగిలిపోయే రోజులు పోయాయని, ఒక నిర్దేశిత లక్ష్యంతో విశాల దృక్పథంతో ఏర్పడిన పార్టీ జేబీపీ అని, కార్యకర్తల నుంచి అ త్యున్నత రాజ్యాంగ బద్ధమైన పదవుల వర కు వెళ్లాలంటే అందుకు జేబీపీ పార్టీ సరైన వేదిక అని తెలిపారు. ఈసందర్భంగా ఎర్రగుంట ప్రాంతానికి చెందిన నిట్ట నర సింహరావు ను పాల్వంచ పట్టణ అధ్యక్షుడు గా నియమించారు.

నరసింహరావు ఆధ్వర్యంలో 30మంది యువకులు జేబీపీ పార్టీ లో చేరారు. వారికి యెర్రా కామేష్ పార్టీ ఖం డువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో బొల్లం రఘు,వంక వసంత్,చాణక్య,నిట్ట వరుణ్,కొలుకుల పవ న్,గుడివాడ ఆదిత్య తదితరులు ఉన్నారు. ఈకార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు గంధం మల్లికార్జునరావు,అసెంబ్లీ అధ్యక్షుడు నాగుల రవికుమార్ తదితరులు పాల్గొన్నారు