12-09-2025 12:48:53 AM
మండల కాంగ్రెస్ అధ్యక్షులు పీరినాకి నవీన్
మణుగూరు, సెప్టెంబర్ 11 (విజ యక్రాంతి) :కమిషన్ల కోసం బీఆర్‌ఎస్ ప్రభుత్వం కాలేశ్వరంప్రాజెక్టును నిర్మిస్తే, రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి పేదవానికి సంక్షేమ పథకాలుఅందించేందుకు కృషిచేస్తుందని, మండల కాంగ్రెస్ అధ్యక్షులు పీరినాకి నవీన్ అన్నారు. గురువారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని, పేదల సంక్షేమాన్ని జీర్ణించుకోలేని మాజీ ఎమ్మె ల్యే రేగా కాంతారావు కేవలం తన పబ్లిసిటీ కోసం సీఎం రేవంత్ రెడ్డి పై, కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని, విమర్శించారు. ఆయన తన తీరు మార్చుకోక పోతే గత ఎన్నికలలో ప్రజలు ఇచ్చిన తీర్పే స్థానిక సంస్థల ఎన్నికలలో బీఆర్‌ఎస్ పార్టీకి పునరావృతం అవుతుందన్నారు.
ఫిరాయింపుల గురించికాంతారావు మాట్లాడమంటే దెయ్యాలు వేదాలు వ ల్లించడమే నన్నారు. నమ్మి గెలిపించిన ఓటర్లను, రాజకీయ బిక్ష పెట్టిన పార్టీని, ఆశ్రయం కల్పించిన ఆఫీసును కబ్జా చేసి మోసం చేసిన ఘనత ఆయనదే నన్నారు. ఇప్ప టికైనా కాంగ్రెస్ ప్ర భుత్వంపై చౌకబారు అనుచిత వ్యాఖ్యలు మానుకోవాలని హితవు పలికారు.
పినపాక ప్రజలు అన్ని గమనిస్తున్నారని, వచ్చే ఎన్నికలలో స్థానిక ఎన్నికలలో పరువు కాపాడు కోవాలని, లేనిచో ఉన్న ఒక్క పదవి కూడా పోవడం ఖాయమన్నా రు. సమావేశంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు శివ సైదులు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తరుణ్ రెడ్డి, శివాలయం గుడి చైర్మన్‌కూచిపూడి బా బు, మైనారిటీ అధ్యక్షులు ఎండి రహీం, మండల నాయకులు, టీవి సుబ్బారెడ్డి, పాతూరి వెంకన్న, గాండ్ల సురేష్, చింతల కృష్ణ, మహబూబ్, కటుకూరి శ్రీనుపాల్గొన్నారు.