12-09-2025 12:45:13 AM
జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
ఖమ్మం, సెప్టెంబర్ 11(విజయ క్రాంతి): అడవుల సంరక్షణ అటవీ అమర వీరులకు మనం ఇచ్చే నిజమైన నివాళి అని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు.ఖమ్మం జి ల్లా కేంద్రంలోని అటవీ శాఖ కార్యాలయం నందు అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా అటవీ సిబ్బంది త్యా గాలను స్మరించు కుంటూ గురువారం నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అను దీప్ దురిశెట్టి, పోలీస్ కమీషనర్ సునీల్ దత్, డి.ఎఫ్.ఓ. సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ లతో కలిసి పాల్గొన్నారు.అటవీ అమరవీరుల స్థూపం వద్ద జిల్లా కలెక్టర్ పుష్పగుచ్చం ఉంచి ఘనంగా నివాళులు అర్పించారు.
అమరవీరుల సంస్మరణార్థం రెండు నిమిషాల మౌ నం పాటించి, అటవీ వన్యప్రాణి రక్షణ ప్ర మాణ స్వీకారం చేశారు.ఈ సందర్భంగా జి ల్లా కలెక్టర్ మాట్లాడుతూ 2022లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ గా ఉన్న సమయంలో శ్రీనివాస్ రావు అనే అటవీ అధి కారి అకాల మరణం చెందారని, వారి మర ణం తనను చాలా కలిచి వేసిందని అన్నారు. కొత్తగూడెం జిల్లాలో వివిధ హోదాలలో పనిచేసే సమయంలో అటవీ పరిరక్షణ మీద అనేక సమస్యలు పరిశీలించానని అన్నారు.
అడవుల సంరక్షణకు నిర్విరామంగా కృషి చే స్తున్న అటవీశాఖ సిబ్బందిని ప్రత్యేకంగా అ భినందనలు తెలిపారు. అటవీ శాఖ సిబ్బందిని కలెక్టర్ సైలెంట్ హీరోస్ గా అభి వర్ణించారు. అటవీ పరిరక్షణ కోసం వీరోచితంగా రాత్రి, పగలు అటవీశాఖ సిబ్బంది ప నిచేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపా రు.అడవులు నరుక్కుంటూ పోతే మన మ నుగడ కష్టం అవుతుందని, మానవ జీవన విధానంలో చెట్లు చాలా కీలకమని అన్నారు.
ఖమ్మం జిల్లా అడవులకు, వన్య ప్రాణులకు నిలయంగా ఉందని, జిల్లాలోని వన సంపద కాపాడే బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అటవీ సిబ్బందికి జోహార్లు అర్పిస్తూ అటవీ అమరవీరుల స్ఫూర్తితో అడవుల సంరక్షణకు అధికారులంతా కృషి చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. జిల్లా అటవీ అధికారి సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ మాట్లాడుతూ అటవీ అమరవీరుల త్యాగం మనం దరికీ స్ఫూర్తి అని వారి ఆదర్శాన్ని అనుసరించి మనం ప్రకృతివన్యప్రాణులను కాపా డుకోవాలని అన్నారు.అటవీ సంరక్షణ ఒక బాధ్యత మాత్రమే కాదు, ప్రతి పౌరుడి కర్తవ్యమని తెలిపారు.