24 March, 2026 | 12:46 PM

కాలనీలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి

24-03-2026 12:00 AM

తుర్కయంజాల్, మార్చి 23: జీహెచ్‌ఎంసీ ఆదిభట్ల సర్కిల్ తుర్కయంజాల్ కమ్మగూడ పరిధిలోని న్యూసుభాష్ నగర్ కాలనీ నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. కందాల జయేం దర్రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల్లో అధ్యక్షుడిగా ఇరుపాక లక్ష్మారెడ్డి గెలుపొందారు. వీరోజు సూర్యనారాయణపై 9 ఓట్ల మెజార్టీతో లక్ష్మారెడ్డి జయకేతనం ఎగరవేశారు.

ఉపాధ్యక్షుడిగా మాల వెంకటరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా సతీష్ రెడ్డి, కోశాధికారిగా రౌతు రవీందర్ గౌడ్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా శ్రీపాల్ రెడ్డి, గౌరవాధ్యక్షుడిగా జయేందర్ రెడ్డి ఎన్నికయ్యారు. అనంతరం నూ తన కార్యవర్గ సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ కాలనీ అభివృద్ధికి తమవంతు కృషి చేస్తామన్నారు. శివాలయంతో పాటు అసోసియేషన్ భవన నిర్మాణానికి ప్రయత్నిస్తామన్నారు. ప్రాధాన్య క్రమంలో కాలనీ అభివృద్ధే ధ్యేయంగా నూతన కార్యవర్గం పనిచేస్తుందని తెలిపారు.