calender_icon.png 20 August, 2025 | 9:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మౌలిక సదుయాలు మెరుగు పరిచేందుకు కృషి

19-08-2025 01:41:46 AM

- రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య

- సీవోఈ, బాలికల గురుకుల కళాశాలల్లో ఆకస్మిక తనిఖీ

బెల్లంపల్లి, ఆగస్టు 18 : బెల్లంపల్లి పట్టణంలోని బాలికల గురుకుల కళాశాల, సాంఘీక సంక్షేమ బాలుర సీవోఈ కళాశాలల్లో మౌలి క సదుపాయాలు మెరుగు పరిచేందుకు సత్వర చర్యలు తీసుకుంటున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ భక్కి వెంకటయ్య తెలిపారు. బెల్లంపల్లి పట్టణంలోని సాంఘిక సంక్షేమ బాలికల, బాలుర సీవోఈ కళాశాలను ఆయన సోమవారం ఆకస్మికం గా తనిఖీ చేశారు. రెసిడెన్షియల్ గురుకుల పాఠశాల, కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులను సిబ్బంది ప్రిన్సిపల్ సొంత బిడ్డలాగా చూసుకోవాలని ప్రిన్సిపల్ నిరూపమకు సూచించారు.

మరుగుదొడ్ల నిర్మాణం కాంపౌండ్ వాల్ సోలార్ ఫెన్సింగ్ నిర్మించాలని, బాలుర సీవోఈ పాఠశాలలో ఆర్వో ప్లాంట్లను మరమత్తులు చేయించాలని ప్రిన్సిపల్ విజయసాగర్‌కు సూచించారు. పాఠ శాలల్లోకి చెరువు బ్యాక్ వాటర్, రాకుండా నిల్వ ఉండకుండా మందమర్రి సింగరేణి జిఎంతో మాట్లాడి మట్టి కుప్పలు పోయించాలని కలెక్టర్ కుమార్ దీపక్‌ను, సబ్ కలెక్టర్ మనోజ్‌ను ఆదేశిస్తున్నట్లు వెంకటయ్య తెలిపారు. పాఠశాలల్లో ఏదైనా సమస్య ఉంటే తమకు నేరుగా చెప్పాలని లేదా రాష్ట్ర కమీష న్ సభ్యుడు రేణికుంట్ల ప్రవీణ్ దృష్టికి తీసు కురావాలన్నారు.

బాలికల పాఠశాలలో నెలకొన్న సమస్యపై స్పందించిన తాళ్ళ గురిజా ల ఎస్సై రామకృష్ణ ను వెంకటయ్య అభినందించారు. ముఖ్యమంత్రి ఆదేశాలమేరకు ఇప్పటి వరకు రాష్ట్రంలోని 20 గురుకుల పాఠశాలలను సందర్శించినట్లు వెంకటయ్య తెలిపారు. అనంతరం బూడిదగడ్డ బస్తీలో ఇటీవల అధికారులు అడ్డుకున్న గణేష్ మండప నిర్మాణాన్ని ఆయన పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. తాత్కాలికంగా షెడ్డు వేసుకొని గణేష్, దుర్గామాత నవరాత్రులను నిర్వహించిన ఏర్పాట్లు చేపట్టుకో వాలని అధికారుల సమక్షంలో బస్తీ వాసులకు సూచించారు.