calender_icon.png 20 August, 2025 | 12:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గోల్కొండపై తొలి జెండాను ఎగరవేసిన ధీరుడు పాపన్నగౌడ్

19-08-2025 01:40:23 AM

జయంతి వేడుకల్లో మాజీ మంత్రి జోగు రామన్న 

ఆదిలాబాద్, ఆగస్టు 18 (విజయక్రాంతి): అణగారిన వర్గాలకు సామాజిక న్యాయం కోసం 17వ శతాబ్దంలోనే పోరాడిన అసమానమైన వ్యక్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని బీఆర్‌ఎస్ పార్టీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి జోగు రామన్న అన్నా రు. పాపన్నగౌడ్ 375వ జయంతి సందర్భంగా ఆదిలాబాద్‌లోని ఆ మహనీయుని విగ్రహానికి పార్టీ నేతలు, గౌడ సంఘం నాయకులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ మొగ ల్ సామ్రాజ్యాన్ని ఎదిరించి గోల్కొండ ఖిల్కొండ తొలి జెండాను ఎగరవేసిన గొప్ప నాయకుడు అని కొనియాడారు. ఆ పోరాట యోధుల్ని స్ఫూర్తిగా తీసుకొని అనగారిన వర్గాల అభివృద్ధి కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. ఆనాడు బీసీ కులాలు అస్పృశ్య తకు గురవుతున్న రోజుల్లో వారికోసం అండ గా నిలిచి పోరాటాలు చేశారని గుర్తు చేశారు. నాటి నుండి నేటి వరకు ఎస్సీ ఎస్టీ బీసీ వర్గల్లో సామాజిక స్పృహ కోసం ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్ర మంలో బీఆర్‌ఎస్ పార్టీ నేతలు, బీసీ సం ఘం, గౌడ సంఘం నాయకులు పాల్గొన్నారు.

మహనీయుల ఆశయ సాధనకు కృషి చేద్దాం: కలెక్టర్ వెంకటేష్ ధోత్రే 

కుమ్రం భీం ఆసిఫాబాద్,ఆగస్టు 18(విజయక్రాంతి):మహనీయుల ఆశయ సాధనకు ఐకమత్యంతో కృషి చేద్దామని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. సోమవారం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వేడుకలకు జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఎం. డేవి డ్, గౌడ సంఘాల నాయకులు, వెనుకబడిన తరగతుల సంఘాల నాయకులకు కలిసి హాజరై పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలవేసి జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం  ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ బహుజన రాజ్యాధికార పోరాట యోధుడు, మొగలాయిల ఆగడాలను పండుకొని ఎదిరించిన మహాయోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని అన్నారు. సౌకర్యాలు లేని రోజులలో సొంతంగా సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని బహుజనుల కొరకు పోరాటాలు చేశారని తెలిపారు. ఇలాంటి మహనీయుల ఆశయ సాధనకు మనమందరం ఐకమత్యంతో ముందుకు సాగాలని, ప్రజల సంక్షే మానికి సమిష్టిగా కృషి చేద్దామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి సజీవన్, జిల్లా పంచాయతీ అధికారి బిక్షపతి గౌడ్, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి రమాదేవి, నాయ కులు అజ్మీర శ్యామ్ నాయక్, గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు సుదర్శన్ గౌడ్, వెనుకబడిన తరగతుల సంఘాల ప్రతినిధులు రమేష్, ప్రణయ్, అధికారులు పాల్గొన్నారు.

బహుజనుల సంక్షేమం కోసం అలుపెరుగని పోరాటం

మంచిర్యాల, ఆగస్టు 18 (విజయక్రాంతి) : సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలను సోమవారం కలెక్టరేట్‌లో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి కలెక్టర్ కుమార్ దీపక్, అదనపు కలెక్టర్ చంద్రయ్య లు పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బహుజనుల సంక్షేమం కోసం అలుపెరుగని పోరాటం చేసిన మహనీయుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని కొనియాడారు.

కుల, మత, వర్ణ విభేదాలు లేని సమాజం కోసం పోరాడేందుకు సొంత సైన్యాన్ని సిద్ధం చేసుకుని బహుజన రాజ్య స్థాపన చేశాడని, సామాజిక న్యాయం కోసం, దోపిడీ వ్యవస్థ నిర్మూలన కోసం, మొగలాయిలను ఎదిరించి బహుజన ప్రజల కోసం అహర్నిశలు కృషి చేశారన్నారు. జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేడుకలలో వివిధ శాఖల జిల్లా అధికారులు, వెనుకబడిన తరగతులు, గౌడ సంఘాల ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.