19-08-2025 01:42:55 AM
ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి
నిర్మల్, ఆగస్టు (విజయక్రాంతి): రాష్ట్రంలో వర్షాలు వరదల వల్ల నష్టపోయిన ప్రజలను రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని నిర్మల్ ఎమ్మెల్యే బీజేఎల్పి నేత మహే శ్వర్‌రెడ్డి అన్నారు. సోమవారం నిర్మల్ పట్టణంలోని వరద ముంపు ప్రాంతాలను సం దర్శించి బాధితులకు అన్ని విధాల అండగా ఉండేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. జిఎన్‌ఆర్ కాలంలో వరద ముంపు రాకుండా చెక్ డాం కూల్చి వేయడం జరిగింది అన్నారు. నిర్మల్ జిల్లా లో మొత్తం 29 దేవాలయాలకు నిధులు మంజూరయాన్ని మొదటి విడతలో 13 దేవాలయాలకు పనులు వెంటనే ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.
నిర్మల్ నియోజకవర్గం ప్రజల అవసరాలను గుర్తించి మౌలిక సదుపాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం ద్వారా ఇప్పటికీ వందల కోట్ల రూపాయలను తీసుకురావడం జరిగిందని తెలిపారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు రావుల రామనాథ్ పద్మ రమేష్ ముత్తెన రెడ్డి రాజు సాయి కార్తీక్ తదితరులు ఉన్నారు.