14 July, 2026 | 3:50 PM

Breaking News

మోదీ, అమిత్ షా స్పందిచరెందుకు?.. 23న మౌనదీక్ష చేస్తా: వీహెచ్   •   కార్మికులకు ఆరోగ్య భరోసా   •   సీఎం రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే వినోద్ బుద్ది మారాలని మాజీ ఎమ్మెల్యే చిన్నయ్య పూజలు   •   దుర్గాభవానీ అమ్మవారికి ప్రత్యేక పూజలు   •   అర్హులైన ప్రతి ఒక్కరు ఎస్ఐఆర్లో దరఖాస్తు సమర్పించుకోవాలి   •   చేర్యాలలో మంగళ, శుక్రవారం "డ్రై డే” పాటించాలి   •   ఓటరు జాబితాలో ప్రతి ఒక్కరు తమ పేరు నమోదు చేసుకోవాలి: సర్పంచ్ ఆనంద్ నాయక్   •   పసిపిల్లల ఎదుగుదలకు తొలిముద్దు తోడ్పాటు   •   సుల్తానాబాద్ గోదాముల ఎదుట రైస్ మిల్లర్స్ ఆందోళన   •   సింగరేణి రక్షణకు.. కార్మిక సంఘాలు కలిసికట్టుగా పని చేయాలి   •  

ఎంజీయూ విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కృషి

02-04-2026 12:00 AM

వైస్ చాన్స్‌లర్ ఖాజాఅల్తాఫ్ హుస్సేన్

నల్లగొండ టౌన్, ఏప్రిల్ 1 : మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం విద్యార్థులు, హాస్టల్లో ఉన్న వివిధ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని యూనివర్సిటీ విసీ ఖాజాఅల్తాఫ్ హుస్సేన్ అన్నారు బుధవారం యూనివర్సిటీలోని హాస్టల్ విద్యార్థులతో చర్చించారు విద్యార్థులు తమ సమస్యలను నేరుగా చర్చించే ప్రజాస్వామిక వాతావరణం ఉందని, సమస్యలు తమ దృష్టికి వచ్చిన వెంటనే సహేతుకంగా స్పందించడం జరుగుతుందని తెలిపారు.

మెస్సుల నిర్వహణ విద్యార్థులు చేపట్టినందున వారి మధ్య అనేక అపోహలు అనుమానాలకు తావు లేకుండా లైసెన్స్ కలిగిన వ్యాపార సంస్థల నుండే వస్తువులు కొనుగోలు చేయాలని విద్యార్థులు తీర్మానించి అధికారుల ముందు సంతకాలు చేశారు. నాణ్యత విషయంలో రాజీ పడకుండా వసతి గృహాల నిర్వహణ, భోజన సదుపాయాలు కల్పించాలని అందుకు విద్యార్థి నిర్వాహకులు సైతం క్రమశిక్షణతో, నిజాయితీతో మెలగాలని అన్నారు.

ఆహార భద్రత ప్రమాణాలు పాటించే వ్యాపార సంస్థల నుండి మాత్రమే ఇకమీదట సరియైన జిఎస్టి జిఎస్టి బిల్లులను మాత్రమే ఆమోదించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య కొప్పుల అంజిరెడ్డి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ డైరెక్టర్ ఆచార్య ఆకుల రవి హాస్టల్స్ డైరెక్టర్ దోమల రమేష్, కామర్స్ మరియు మేనేజ్మెంట్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య శ్రీదేవి, సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య వసంత, ఇంజనీరింగ్ ఆచార్య రేఖ, హాస్టల్ వార్డెన్లు విద్యార్థులు పాల్గొన్నారు .