calender_icon.png 21 August, 2025 | 10:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి

25-01-2025 12:37:00 AM

మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి

మునుగోడు, జనవరి 24 :  ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తున్నదని మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డి అన్నారు. మునుగోడు మండలం కొంపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్మించిన అదనపు తరగతి గదులతోపాటు వెదిరే పూలమ్మ ఫౌండేషన్ సహకారంతో నిర్మించిన  కళావేదికను  శుక్రవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు.

రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో సమూల మార్పులు రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రగతిలో విద్య కీలకపాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. సర్కారు పాఠశాలల్లో అన్ని సదుపాయాలు కల్పిస్తామన్నారు. అంతకుముందు ఎలగలగూడెంలో సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి నెల్లికంటి సత్యం మాతృమూర్తి పార్వతమ్మ దశదినకర్మకు హాజరై ఆమె చిత్రపటానికి  పూలమాల వేసి నివాళులర్పించారు.