calender_icon.png 21 August, 2025 | 6:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సైబర్ నేరాల ప్రధాన సూత్రదారి అరెస్ట్

25-01-2025 12:36:44 AM

వనపర్తి టౌన్, జనవరి 24: ఉమ్మడి మహబూబ్ నాగర్ జిల్లాలోని తండాలు ఇతర చుట్టుప్రక్కల గ్రామాలలోని అమాయక యువకులకు డబ్బు ఆశ చూపి సైబర్ నేరాల వైపు మళ్ళించి వారి బంగారు భవిషత్తును ఆగం చేసిన సైబర్ నేరాల ప్రధాన సూత్రదారుడు కరడుగట్టిన సైబర్ నేరగాడు వర్త్యావత్ రమేష్ నాయక్ @ లడ్డు రమేష్ ను అరెస్ట్ చేసినట్లు వనపర్తి సైబర్ క్రైం  డిఎస్పీ, ఎన్ బి, రత్నం,  వనపర్తి సీఐ, క్రిష్ణలు తెలిపారు.

ఈ రోజు పట్టుబడ్డాడు. శుక్రవారం  వనపర్తి పట్టణంలోని  సీఐ కార్యాలయంలో  ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. గత మూడు, నాలుగు సంవత్సరాల నుండి రెండు రాష్ట్రాలకు సంబంధించిన అమాయక ప్రజలను ఇండియా బుల్స్/ధని అలాగే ముద్ర లోన్స్ పేరు మీద సైబర్ నేరాల ద్వారా దోచుకుంటున్నారన్నారు. 

తన తండా వాసులు మరియు ఎర్రగట్టు తాండా పామిరెడ్డిపల్లి ముందరి తాండ , ఛీకర్ చెట్టు తాండ, పిల్లికుంట తాండ, మరియు ఉమ్మడి మహబూబ్ నాగర్ జిల్లాలోని సూర్తి తండా, కనకాపూర్ తాండా మరియు వివిధ గ్రామాలకు చెందిన అనేక మంది యువకులను సైబర్ నేరాలు చేసేందుకు ఢిల్లీ, కోల్ కత, మరియు పాట్నాలకు పిలిపించి వారికీ శిక్షణ ఇచ్చి వారితో రోహిత్ @ రాజు భాయ్ @ సోను, పవన్. జి .రాజు @ రాజు భల్లం, శివకుమార్ @ శంకర్ జీ, పంకజ్ మరియు అంకిత్ సహకారంతో సైబర్ నేరాలు చేపించి, వారు వసూలు చేసిన డబ్బులలో నుంచి వారి వాటా కింద 30% డబ్బులు ఇప్పించి, తానుపై తెలిపిన బీహార్ రాష్ట్రానికి చెందినా వారి ద్వార కమిషన్ డబ్బులు తీసుకోనేవాడని ఈ సందర్భంగా తెలిపారు.

నిందితుడు ఇప్పటివరకు సుమారు ఒక కోటి రూపాయల* కంటే ఎక్కువగానే సంపాదించాడని ఈ క్రమంలో నేరస్తుడికి సహకరించిన అతని అన్న చంద్రశేకర్ మరియు అతని అమ్మ గోపమ్మని కూడా ఇట్టి నేరము నందు నేరస్తులుగా చేర్చటమైనదని తెలిపారు