యాదాద్రిభువనగిరి(విజయక్రాంతి): ప్రసిద్ద పుణ్య క్షేత్రం యాదాద్రి లక్ష్మి నృసింహ స్వామి సన్నిధిలో శనివారం ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ స్వామి వారి ఆలయ ముఖ మండపం అర్చకులు లక్షనామ స్తోత్ర పారాయణలతో వైభవంగా లక్ష పుష్పార్చన నిర్వహించారు. నిత్య కైంకర్యాల అనంతరం సుదర్శన నరసింహ హోమ పూజలు , నిత్య కల్యాణం శాస్త్రోక్తంగా జరిపారు