calender_icon.png 24 December, 2025 | 8:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలీసుల నాకాబంది

24-12-2025 06:22:06 PM

లక్షెట్టిపేట టౌన్,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట పట్టణంలోని కరీంనగర్ చౌరస్తా వద్ద బుధవారం లక్షెట్టిపేట పోలీసులు నాకాబందీ నిర్వహించారు. లక్షెట్టిపేట ఎస్సై గోపతి సురేష్ సిబ్బందితో కలిసి వాహనాలను ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ ఎలాంటి ప్రమాదాలు జరగకుండా పోలీస్ స్టేషన్ పరిధిలో ఎవరు కూడా ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు చేపట్టకుండా ముందస్తు చర్యలో భాగంగా తనిఖీలు చేపట్టామన్నారు.

వాహనదారులు రవాణా నిబంధనలు పాటించాలని, వాహన పత్రాలు వాహనాల వెంట ఉంచుకోవాలని, వాహనాలు నడిపే సమయంలో సీట్ బెల్ట్ ధరించాలని, ద్విచక్ర వాహనదారుడు తప్పకుండా హెల్మెట్ ధరించాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, మత్తు పదార్థాలైన గంజాయి లాంటి వాటికి బానిస కాకూడదని, అలాంటివి రవాణా చేసినా, తరలించినా చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. జాతీయ రహదారిపై వెళ్తున్న వాహనాలను ఆపి తనిఖీలు చేస్తూ వాహనాలు ఎవరివి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాయని వివరాలు సేకరించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.