24-12-2025 06:25:27 PM
వాగ్దేవి స్కూల్ లో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు
హుజూర్ నగర్: భారతదేశం భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనమని స్కూల్ డైరెక్టర్స్ జాల జ్యోతి బాబు, నిడిగొండ గంగాధర్ అన్నారు. బుధవారం పట్టణంలోని శ్రీ వాగ్దేవి హై స్కూల్ నందు సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... విద్యార్థులకు చిన్ననాటి నుండే, అన్ని పండగల ప్రాముఖ్యతను తెలియచేయడానికి పాఠశాలలో ప్రతి వేడుకలను నిర్వహిస్తున్నామని తెలిపారు. విద్యార్థులు శాంటా క్లాజ్, ఏంజెల్ వేషధారణలో అలరించారు. క్రీస్తు జనన వృత్తాంతాన్ని తెలిపే పశువుల పాక, క్రిస్మస్ ట్రీ,స్టార్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు, సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. క్రిస్మస్ కేక్ కట్ చేసి మిఠాయిలు అందజేశారు.