calender_icon.png 24 December, 2025 | 8:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జీవాల ఎదుగుదలకు నట్టల నివారణ మందు తప్పనిసరి

24-12-2025 06:59:15 PM

నకిరేకల్,(విజయక్రాంతి): జీవాల ఎదుగుదలకు నట్టల నివారణ మందు తప్పనిసరి అని మండల పశువైద్యాధికారులు జె.రామ్ రెడ్డి, బి.రవికుమార్ పేర్కొన్నారు. బుధవారం మండలంలోని గొల్లగూడెం గ్రామంలో నట్టల నివారణ మందు కార్యక్రమాన్ని స్థానిక సర్పంచ్ చిర్రబోయిన లక్ష్మి సత్యనారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు.గొల్లగూడెం, నరసింహపురం గ్రామాలలో 1850 గొర్రెలు, 150 మేకలకు నట్టల నివారణ మందును తాపించారు. ఈ కార్యక్రమంలో ఎల్ ఎస్ ఏ లు కె. భానుచందర్, ఎ. శ్రీశైలం, ఆఫీస్ సబార్డినేటర్స్ బి దుర్గాప్రసాద్, అఖిల్, గోపాలమిత్ర ఎల్లంల శంభు లింగం యాదవ్ పాల్గొన్నారు.