24-12-2025 06:56:32 PM
గజ్వేల్: రోడ్డు ప్రమాదంలో మరణించిన గజ్వేల్‌కు చెందిన కాశమైన చేతన్ కుమార్ కుటుంబానికి స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ అండగా నిలిచింది. చేతన్ కుమార్ ఏడాది క్రితం స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్‌లో పర్సనల్ ఆక్సిడెంట్ (PA) పాలసీని తీసుకున్నారు. ఇటీవలే ఆయన ఉద్యోగ నిమిత్తం జగదేవపూర్ వెళ్తుండగా అలిరాజపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. చేతన్ కుమార్ పాలసీ వివరాలను గజ్వేల్ బ్రాంచ్ ఏజెంట్ నరసింహ రెడ్డి కంపెనీ దృష్టికి తీసుకెళ్లడంతో, క్లెయిమ్ ప్రక్రియను వేగంగా పూర్తి చేశారు.
పాలసీ, బోనస్ కలిపి మొత్తం రూ.10.50 లక్షల నగదును నామినీ బాలమణి బ్యాంక్ ఖాతాలో జమ చేశారు. సికింద్రాబాద్ జోనల్ హెడ్ యుగంధర్, ఎస్. నారాయణ ఈ సందర్భంగా మాట్లాడుతూ చేతన్ కుమార్ తీసుకున్న పాలసీతో తల్లిదండ్రులకు ఆర్థికంగా కొండంత అండగా నిలిచిందన్నారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత ప్రమాద బీమా, స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ హెల్త్ పాలసీ లు కలిగి ఉండటం అత్యవసరం అని పేర్కొన్నారు.