calender_icon.png 24 December, 2025 | 8:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉత్తమ కోర్టు డ్యూటీ ఆఫీసర్ అవార్డు అందుకున్న కానిస్టేబుల్ ప్రవీణ్

24-12-2025 06:47:24 PM

తుంగతుర్తి,(విజయక్రాంతి): తుంగతుర్తి పోలీస్ స్టేషన్ లోని కోర్టు డ్యూటీలు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్ టి.ప్రవీణ్ కుమార్ ఉత్తమ అవార్డు అందుకున్నారు. బుధవారం సూర్యాపేటలోని ఎస్పీ కార్యాలయంలో 2025వ సంవత్సరంలో కోర్టు డ్యూటీలో భాగంగా ఉత్తమ ప్రతిభ ప్రదర్శించినందుకు గాను ఎస్పీ నరసింహ చేతుల మీదుగా బెస్ట్ కోర్టు డ్యూటీ ఆఫీసర్ అవార్డు అందుకున్నారు. దీంతో ఎస్ఐ క్రాంతి కుమార్, పోలీస్ సిబ్బంది, మేధావులు ఆయనను అభినందించారు.