calender_icon.png 8 December, 2025 | 12:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎకగ్రీవం @ 44

08-12-2025 01:03:56 AM

  1. రెండు విడతల్లో సగానికి పైగా తండాలే..

సిరిసిల్ల జిల్లాలోనేఅధికం

కరీంనగర్, డిసెంబర్ 7 (విజయ క్రాంతి): గ్రామపంచాయతీ ఎన్నికల్లో రెండు విడతల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 44 గ్రామపంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మొదటి విడుతలో 20 గ్రామపంచాయతీలు, రెండవ విడతలో 24 గ్రామపంచాయ తీలు ఏకగ్రీవమయ్యాయి. ఏకగ్రీవ పంచాయతీలలో సగానికి పైగా తండాలు ఉండడం విశేషం. అత్యధికంగా రాజన్న సిరిసిల్ల జిల్లా లో మొదటి విడుతలో 9 గ్రామపంచాయతీలు, రెండవ విడతలో 9 గ్రామ పంచా యతీలు, మొత్తం 18 గ్రామపంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. 

మొదటి విడతలో 20 గ్రామపంచాయతీలు..

మొదటి విడత నామినేషన్ల ఉపసంహరణ అనంతరం ఉమ్మడి జిల్లాలో 20 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అ ధికారులు ధృవీకరించారు. ఇందులో కరీంనగర్ జిల్లాలోని చొప్పదండి మండలం దేశాయిపేట, పెద్దకుర్మపల్లి, రామడుగు మండ లం శ్రీరాములపల్లి ఉండగా, పెద్దపల్లి జిల్లాలో నాలుగు గ్రామాలు మంథని మం డలం నాగారం, తోటగోపయ్యపల్లి, బైతుపల్లి, రామగిరి మండలం చందనాపూర్,

జగి త్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మూలరాంపూర్, రామాపూర్, కథలాపూర్ మండలం రాజారంతండా, మెట్పల్లి మండలం చింతలపేట పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. అత్యధికంగా రాజన్న సిరి సిల్ల జిల్లాలో 9 గ్రామాలు ఏకగ్రీవమయ్యా యి. జిల్లాలోని చింతమణితండా, రూప్లానాయక్ తండా, వీరునితండా, అడ్డబోరెతండా, బడితండా, కాయిదిగుట్ట, కుమ్మరిపేట, జైసేవాలాల్ తండాలు ఏకగ్రీవమయ్యాయి.

రెండో విడతలో 24 గ్రామపంచాయతీలు.. 

గ్రామపంచాయతీ రెండవ విడత ఎన్నికల్లో 24 గ్రామపంచాయతీలు ఏకగ్రీవమైన ట్లు ఎన్నికల అధికారులు అధికారికంగా ధ్రు వీకరించారు. జగిత్యాల జిల్లాలో 10 గ్రామా లు, జగిత్యాల రూరల్ మండలం చర్లపల్లి, క న్నాపూర్, జగిత్యాల అర్బన్ మండలం అం బారిపేట, కొడిమ్యాల మండలం చింతలపల్లి, రాయికల్ మండలం వీరాపూర్, వస్తా పూర్, సారంగాపూర్ మండలం నాయకపుగూడెం, వడ్డెర కాలని, భీం రెడ్డిగూడెం, బీ ర్పూర్ మండలం గుండుగూడెం కాగా,

పెద్దపల్లి జిల్లాలో మూడు గ్రామాలు, ధర్మారం మండలం నాయకంపల్లి, బొట్ల వనపర్తి, బంజేరుపల్లి గ్రామాలు, సిరిసిల్ల జిల్లాలో 9 గ్రామాలు, ఇల్లంతకుంట మండలం చిక్కుడువానిపల్లె, తిప్పాపురం, పత్తికుంటపల్లి, కిష్టారావుపల్లి, కేశన్నపల్లి, ముస్కాన్ పేట, తంగళ్ళపల్లి మండలం బాలమల్లుపల్లి, వేణుగోపాలపూర్, గండి లచ్చాపేట్ కాగా, కరీంనగర్ జిల్లాలో రెండు గ్రామాలు, గన్నేరువరం మండలం పీచుపల్లి, గోపాల్ పూర్ గ్రామాలు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు ధ్రువీకరించారు. కాగా మూడో విడత నామినేషన్ల పరిశీలనకొనసాగుతుంది.