పంద్రాగస్టు వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు
12-08-2026 12:22 AM
కలెక్టర్ రిజ్వాన్ బాషాషేక్ ఆదేశం
గద్వాల, ఆగస్టు 11 (విజయక్రాంతి): జిల్లాలో పంద్రాగస్టు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులను ఆదేశించారు. మంగళవారం నిర్వహించిన సన్నాహక సమావేశంలో పరేడ్ గ్రౌండ్లో వేదిక, తాగునీరు, పారిశుధ్యం, సీటింగ్ తదితర ఏర్పాట్లు పక్కాగా చేయాలని సూచించారు.
అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రతిబింబించేలా స్టాల్స్, ప్రగతి నివేదిక ఏర్పాటు చేయాలని తెలిపారు. ఈ నెల 15 నుంచి అర్హులకు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేయనున్న నేపథ్యంలో అధికారులు సిద్ధంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. కొత్తగా అర్హులైన వారు ఈ నెల 31లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.






