14 June, 2026 | 2:33 PM

Breaking News

తుమ్మన్‌పేటకు బయలుదేరాం.. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అండగా నిలుస్తాం   •   పటేల్ ప్రధాని కావాల్సింది: ఎంపీ లక్ష్మణ్   •   అధైర్య పడొద్దు.. రైతుల పండగ ప్రభుత్వం   •   వర్ష నష్ట ప్రాంతాలను పరిశీలించిన మంత్రి, ఎంపీ   •   శ్రీ ఉమామహేశ్వరంలో కలెక్టర్ ప్రత్యేక పూజలు   •   బంజీ జంప్ సిబ్బంది నిర్లక్ష్యం.. 21 ఏళ్ల యువతి మృతి   •   మహిళల టీ20 ప్రపంచకప్: నేడు భారత్-పాకిస్థాన్ మధ్య పోరు   •   ఇరాన్ తో శాంతి ఒప్పందంపై ట్రంప్ కీలక ప్రకటన   •   ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు బెల్లంపల్లి సమస్యలు   •   అయ్యగారి చెరువు సుందరీకరణ కోసం, రాత్రి, పగలు శ్రమించి పనులు పూర్తి చేయాలి   •  

స్వాతంత్య్ర వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి

12-08-2025 12:00 AM

కలెక్టర్ జితేష్ వి.పాటిల్

భద్రాద్రి కొత్తగూడెం ఆగస్టు 11 (విజయక్రాంతి):కొత్తగూడెం ప్రగతి మైదానంలో జ రగనున్న 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను దేశభక్తి, పండుగ వాతావరణంలో అట్టహాసంగా నిర్వహించేందుకు అన్ని శాఖ ల అధికారులు సమన్వయంతో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఆదేశించారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయం సమావేశ మందిరంలో జిల్లా స్థాయి అన్ని శాఖల అధికారులతో సన్నాహ క సమీక్షా సమావేశం నిర్వహించారు.

ప్రగతి మైదానంలో ప్రధాన వేదిక, సీటింగ్, అతిథుల వసతులు సక్రమంగా ఉండేలా ముం దస్తు చర్యలు తీసుకోవాలని, వర్షాకాలం దృష్ట్యా వాటర్ ప్రూఫ్ టెంట్లు ఏర్పాటు చే యాలని కలెక్టర్ సూచించారు. వేడుక ప్రాం గణంలో 108 అంబులెన్స్, వైద్య బృందాలను సిద్ధంగా ఉంచి, అవసరమైన మందు లు, ప్రథమ చికిత్స సదుపాయాలు అందుబాటులో ఉంచాలని ఆరోగ్య శాఖకు ఆదేశిం చారు.

ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతిబింబించేలా జిల్లా ప్రగతి నివేదిక రూపొందించాలని, అలాగే వ్యవసాయం, ఉద్యానవనం, పశుసంవర్ధక, అటవీ, విద్య, వైద్యం, పంచాయతీ రాజ్, ఆర్టీసీ తదితర శాఖల పనితీరును ప్రతిబింబించే స్టాల్స్ ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. ప్రోటోకాల్ ప్రకారం అధికార అతిథులకు ఆహ్వానాలు పంపించడంతో పాటు, జాతీయ పతాకం గౌరవానికి భంగం కలగకుండా అన్ని ఏర్పాట్లలో జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు.

విద్యార్థుల ద్వారా దేశభక్తి గీతాలు, నృత్యాలు, నాటికలు నిర్వహించి జాతీయ భావన పెంపొందించాలని కలెక్టర్ సూచించారు. ప్రశంసా పత్రాల బహూకరణ కోసం శాఖల వారీగా ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగుల పేర్లను నిర్ణీత గడువు లోపు సమర్పించాలన్నారు.అన్ని శాఖల అధికారులు తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి, స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు విజయవంతంగా సాగేందుకు కృషి చేయాలన్నారు.

జిల్లా ప్రజల్లో జాతీయ భావన పెంపొందేలా వేడుకలు నిర్వహించాలన్నది కలెక్టర్ ఆదేశించారు.ఈ సన్నాహక సమావేశంలో అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్, ట్రైనీ కలెక్టర్ సౌరబ్ శర్మ, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, కొత్తగూడెం ఆర్డీవో మధు, జిల్లా స్థాయి అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.