పటేల్ ప్రధాని కావాల్సింది: ఎంపీ లక్ష్మణ్
హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 21 సంవత్సరాల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా దేశంలోనే అత్యధిక కాలం ప్రధానిగా కొనసాగిన మోదీ పాలన విజయవంతంపై రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో బీజేపీ ఎంపీ, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సదర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ.. స్వదేశీ సంస్థానాలను విలీనం చేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రధానమంత్రి కావాల్సి ఉందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ పేర్కొన్నారు.
పటేల్ ను ప్రధానిగా చేయాలని నాటి ఐఎన్సీ నేతలు చాలా మంది సూచించారని, కానీ మహాత్మాగాంధీ మాత్రం జవహర్ నెహ్రూను ప్రధానమంత్రిని చేశారని తెలిపారు. తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ మీనాక్షీ నటరాజన్ మధ్యప్రదేశ్‌లో రాజ్యసభ నామినేషన్‌ను రిటర్నింగ్ అధికారి తిరస్కరిస్తే బీజేపీపై ఆరోపణలు చేస్తున్నారని లక్ష్మణ్ మండిపడ్డారు. అంతర్గత కొట్లాట వల్ల కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైందని, నామినేషన్ ను ఎలక్షన్ కమిషన్ తిరస్కరిస్తే సీట్ చోరీ అని మాపై కాంగ్రెస్ ఆరోపణలు చేస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.






