12-08-2025 12:00:00 AM
- మట్టి మైనింగ్ మాఫియా ఆగడాలు
- అనుమతి లేని మట్టి తోలకాలు
- ప్రభుత్వ ఆదాయానికి గండి
- చోద్యం చూస్తున్న సంబంధిత శాఖ
ఎర్రుపాలెం, ఆగస్టు 11 (విజయ క్రాంతి): ప్రకృతి సంపదను మట్టి మైనింగ్ మాఫి యా కొండలను పిండేస్తున్నారని సిపిఎం మండల కార్యదర్శి మద్దాల ప్రభాకర్ రావు పేర్కొన్నారు ఎలాంటి అనుమతులు లేకుండా కొందరు ఎదేచ్ఛగా మట్టిని తరలించకపోతున్నారని దీనివల్ల లక్షలాది రూపాయలు ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని సంబంధించిన శాఖ అధికారులు ముడుపుల ముసుగులో ఉదాసీనులతో చూసి చూడనట్లు మైనింగ్ మాఫియా కు సహకరిస్తున్నారని అధిక లోడులతో లారీల ద్వారా రోడ్లను పాడు చేస్తున్నారని ఈ అక్రమ మైనింగ్ మాఫియాను అడ్డుకునే వారే కరువయ్యారని ఘాటుగా విమర్శించారు.
తహసిల్దార్ మన్నే ఉషా శారద కు ఇచ్చిన వినతి పత్రంలో సమాచార హక్కు చట్టం ద్వారా ఏఏ గ్రామాలలో ఎంతమందికి మట్టి తోలుకోవడానికి అనుమతి ఉందో కొండలను తవ్వేటప్పుడు ఎంత విస్తీర్ణం వరకు ప్రభు త్వం అనుమతినిచ్చిందో సమాచార హక్కు చట్టం ద్వారా తెలియచేయాలని పేర్కొన్నారు.
ఎవరికైనా అనుమతులు ఉన్నప్పుడు మట్టిని తొవ్వుకుంటున్న వారు ప్రభుత్వం ఇచ్చిన భూగర్భ గనుల , పర్యావరణ లీజు ప్రకారం ఏ ఏ గ్రామాలలో అనుమతులు ఇ చ్చారు, ఎంత విస్తీర్ణం అనుమతులు వరకు తవ్వుతున్నారో తెలియచేయాలని పేర్కొన్నా రు. ప్రభుత్వం అనుమతులు లేకుండా అక్రమంగా మట్టిని తరలిస్తున్న వారిపై ఎన్ని పె నాల్టీలను విధించారు ,దానివల్ల ప్రభుత్వానికి ఎంత ఆదాయం వచ్చిందో సమాచార హక్కు చట్టం ద్వారా తెలియజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు నా గులవంచ వెంకట్రామయ్య, సగ్గుర్తి సంజీవరావు ,బసవయ్య తదితరులు పాల్గొన్నారు.