మెదక్‌లో తగ్గిన పోలింగ్ శాతం
గతంలో 77.30శాతం ఉండగా ఈసారి 75.09
4 శాతానికి పడిపోయిన పోలింగ్
నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లలో మహిళా ఓటర్ల ప్రభావం
73.87శాతంతో మహిళల ఓటింగ్
అత్యధికంగా నర్సాపూర్‌లో 84.25 శాతం పోలింగ్ నమోదు
భువనగిరిలో 76.78 శాతం
2019 పార్లమెంట్ ఎన్నికల కంటే 1.67శాతం ఎక్కువ
మెదక్/సిద్దిపేట మే 14 (విజయక్రాంతి) : మెదక్ లోక్‌సభ నియోజకవర్గం ఎన్నికల రణరంగం ముగిసింది. నియోజక వర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో నిర్వహించిన ఎన్నికల్లో 75.09శాతం ఓటింగ్ నమోదైంది. మెదక్ పార్లమెంట్ పరిధిలో సిద్దిపేట, మెదక్, నర్సాపూర్, సంగారెడ్డి, పటాన్‌చెరు, దుబ్బాక, గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. గత 2019 పార్లమెంట్ ఎన్నికల్లో 77.30శాతం ఓటింగ్ నమోదు కాగా, ఈసారి 75.09శాతంతో 4.21శాతం మైనస్‌లో ఉంది. గత ఎన్నికల్లో మహిళలు అధికశాతం ఓటింగ్‌లో పాల్గొన్నట్లుగానే ఈసారి నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లలో మహిళా ఓటర్లే ప్రభావం చూపారు. మెదక్ పార్లమెంట్ పరిధిలో 18,28,210మంది ఓటర్లు ఉండగా 9,02,110మంది పురుషులు, 9,25,891మంది మహిళా ఓటర్లు ఉన్నారు. వీరితో పాటు 209 ట్రాన్స్‌జెండర్లు ఉన్నారు. అయితే ఈ ఎన్నికల్లో 6,88,854 మంది పురుషులు ఓటు హక్కు వినియోగించుకోగా 6,83,975 మంది మహిళలు ఓటింగ్‌లో పాలుపంచుకున్నారు. పురుషులతో సమానంగానే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తంగా 24.91శాతం మంది తమ ఓటు హక్కు వినియోగించుకోలేదు. అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా పరిశీలిస్తే.. సిద్దిపేటలో 1,16,436 మంది పురుష ఓటర్లకు గాను 87,030 ఓట్లు పోలయ్యాయి. 1,21,084మంది మహిళా ఓటర్లకు గాను 87,912 మంది ఓట్లు వేశారు.
మెదక్ సెగ్మెంట్‌లో 1,03,918 పురుషులకు గాను 85,057మంది, 1,14,813 మంది మహిళలకు గాను 90,351 మంది ఓట్లు వేశారు. అలాగే నర్సాపూర్ నియోజకవర్గంలో 1,10,184 మంది పురుషులకు గాను 95,185 మంది, 1,16,898 మంది మహిళలకు గాను 96,128 మంది ఓటు వేశారు. సంగారెడ్డిలో 1,23,171 పురుషులకు గాను 91,069, 1,26,567మంది మహిళలకు గాను 88,723 మంది ఓటు వేశారు. పటాన్‌చెరు నియోజకవర్గంలో 2,13,017మంది పురుషులకు గాను 1,35,848, 2,00,880 మహిళా ఓటర్లకు గాను 1,24,969 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. దుబ్బాకలో 97,198 పురుషులకు గాను 81,426 మంది, 1,02,927 మంది మహిళలకు గాను 83,526 మంది ఓటు వేశారు. అలాగే గజ్వేల్ నియోజకవర్గంలో 1,38,186 మంది పురుష ఓటర్లకు గాను 1,13,239 మంది ఓటు వేయగా, 1,42,722 మంది మహిళా ఓటర్లకు గాను 1,12,366 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తంగా ఈ ఎన్నికల్లో 18,28,210 ఓటర్లకు గాను 13,72,894 మంది ఓటు హక్కును వినియోగించుకొని 75.09 శాతం నమోదు అయిం దని అధికారులు వెల్లడించారు. మెదక్ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల లో అత్యధికంగా నర్సాపూర్‌లో 84.25 శాతం పోలింగ్ నమోదు కాగా అత్యల్పంగా పటాన్‌చెరులో 63.01శాతం నమోదైంది.
జహీరాబాద్‌లో పెరిగిన పోలింగ్
లోక్‌సభ ఎన్నికల్లో జహీరాబాద్‌లో గతం కంటే పోలింగ్ శాతం పెరిగింది. ఈ ఎన్నికల్లో 74.63 శాతం పోలింగ్ నమోదు కాగా 2019 పార్లమెంట్ ఎన్నికల్లో 74.8 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది. పార్లమెంట్ ఎన్నికల్లో 16,41, 410 లక్షల ఓట్లు ఉండగా, పురుషులు 8,39,462 లక్షలు, మహిళలు 8,39,489 లక్షలు, ఇతరులు 59 మంది ఉన్నారు. ఎన్నికల్లో 12,25, 049 ఓట్లు పోలు కాగా ఇందులో పురుషులు 6,08,097లక్షలు, మహిళలు 6,16,936 లక్షలు, ఇతరులు 16మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 8,839 మంది మహిళ ఓటర్లు పురుషుల కంటే అధికంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. బాన్సువాడలో 5,810 మంది మహిళలు, ఎల్లారెడ్డిలో 77 47మంది, కామారెడ్డిలో 10,077 మంది మహిళలు అధికంగా ఓట్లు వేశారు. పార్లమెంట్ పరిధిలో ఉన్న ఆందోల్‌లో 75.63శాతం, బాన్సువాడ 76.98, జుక్కల్ 75.83, కామా రెడ్డి 71.41, నారాయణఖేడ్ 72.71, ఎల్లారెడ్డి 77.54, జహీరాబాద్ 72.90 శాతం పోలింగ్ నమోదు అయింది. పార్లమెంట్ పరిధిలో 74. 54శాతం పోలింగ్ నమోదు కావడంతో పెరిగిన పోలింగ్ ఎవరికి మేలు చేస్తుందో వేచి చూడాల్సిందే.




