ప్రతి ఓటరును ప్రజా ప్రతినిధులు కలవాలి
- సర్ పత్రం ఇచ్చారా? తెలుసుకోండి
- పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి
మహమ్మదాబాద్ జులై 21 : ఓటు హక్కు నమోదులో భాగంగా నిర్వహిస్తున్న సర్ ప్రక్రియలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. అర్హులైన ప్రతి ఒక్కరి ఓటరు వివరాలు సక్రమంగా నమోదు అయ్యేలా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రజలకు సర్ ప్రాధాన్యతపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలన్నారు.
ఓటరుకు ఎలాంటి సమస్యలు ఉన్న వాటిని తెలుసుకొని పరిష్కరించే దిశగా ప్రతి ఒక్కరు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ కమతం శ్రీనివాస్ రెడ్డి. కె విష్ణువర్ధన్ రెడ్డి, స్థానిక సర్పంచ్ రామ్ లాల్, పార్టీ అధ్యక్షులు కేఎం నారాయణ, అనంత లక్ష్మారెడ్డి, ఎమ్మార్వో విద్యాసాగర్ రెడ్డి, ఎంపీడీవో నరేందర్ రెడ్డి, శాంతి రంగ్యా, పులిందర్ రెడ్డి, తదితరులు ఉన్నారు.






