పారిశుద్ధ్య కార్మికులకు పెంచిన వేతనాలు వెంటనే చెల్లించాలి
22-07-2026 01:26 AM
అలంపూర్, జూలై 21: రాజోలి మండల ఎంపీడీవో మహమ్మద్ సయ్యద్ ఖాన్కు పారిశుద్ధ్య కార్మికులు, సీపీఎం నాయకులు మంగళవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా సీపీఎం మండల కార్యదర్శి విజయకుమార్ మాట్లాడుతూ గ్రామపంచాయతీ తీర్మానం మేరకు ప్రకటించిన నెలకు రూ.2,200 వేతన పెంపును గత కొన్ని నెలలుగా అమలు చేయడం లేదని, పెంచిన వేతనాలతో పాటు ప్రతి నెలా జీతాలు సకాలంలో చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. సమస్య పరిష్కారం కాకపోతే జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపడతామని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో సీఐటీయూ, గ్రామపంచాయతీ యూనియన్ నాయకులు పాల్గొన్నారు.






