26-12-2025 05:47:11 PM
పాపన్నపేట,(విజయక్రాంతి): ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల ఆలయ పరిసర ప్రాంతాల్లో ఓ గుర్తు తెలియని యాచక (73) సంవత్సరాల వృద్ధుడు మృతి చెందిన సంఘటన శుక్రవారం వెలుగు చూసింది. పాపన్నపేట ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ సమాచారం మేరకు.. గత కొన్ని రోజులుగా యాచకుడిగా ఓ వృద్ధుడు సంచారం చేస్తూ ఆలయ పరిసర ప్రాంతాల్లో ఉంటున్నాడు. చలి తీవ్రతను తట్టుకోక శుక్రవారం పడి ఉండడాన్ని గమనించిన స్థానికులు పాపన్నపేట పోలీసులకు సమాచారం అందివ్వడంతో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించగా వృద్ధుడు మృతి చెందినట్లు గుర్తించారు.
ఆచూకీ కోసం పరిశీలించగా ఎలాంటి ఆచూకీ లభ్యం కాకపోవడంతో పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. మృతుడి శరీరంపై నీలం రంగు చొక్క ధరించి తెల్లని గడ్డం కలిగి ఉన్నాడని. మృతుడిని గుర్తించిన సంబంధికులు పాపన్నపేట ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ 87126 57920, మెదక్ రూరల్ సీఐ కార్యాలయం లో సంప్రదించాలని కోరారు.