calender_icon.png 26 December, 2025 | 7:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చిత్రాంగద - సారంగదరుడు పద్య కృతుల ఆవిష్కరణ

26-12-2025 05:39:10 PM

మహబూబ్ నగర్ టౌన్: జాతీయ సాహిత్య పరిషత్ పాలమూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో కవి పరమేశ్వర, ఆర్ష విద్యా నిష్ణాత శ్రీ రాచాలపల్లి బాబు దేవీ దాస్ రావు  పద్య కృతుల ఆవిష్కరణ స్థానిక మహబూబ్ నగర్ జిల్లా కేంద్ర గ్రంధాలయం, మెట్టుగడ్డలో జా. సా.ప. జిల్లా అధ్యక్షులు విరివింటి వెంకటేశ్వర శర్మ అధ్యక్షతన ఎంతో వైభవంగా రసవత్తరంగా సాగి సభికులను ఆకట్టుకున్నది. సాహిత్యం జగద్వితం కోసం సృష్టించబడుతుంది కవులు సమాజ హితాన్ని కోరుతారని  తెలిపారు.

ముఖ్య అతిథి శ్రీ రామచంద్ర ప్రభో! స్తుతి కృతిని ఆవిష్కర్త ఆచార్య కసిరెడ్డి వెంకట్ రెడ్డి  మాట్లాడుతూ  సరళమైన సుందరమైన సుమధుర తెలుగు భాషలో శ్రీ రామ కథను అందించారు. ఇందులో ప్రాచీన కవుల గుంబనం లలిత పదజాలం చదువులను ఆకట్టుకుంటుంది. రామచంద్ర ప్రభో! కావ్యం సరళ సుందరంగా సుమధురంగా తెలుగు భాషలో మనకు అందించారని కసిరెడ్డి  కొనియడారు.  రామచంద్ర ప్రభో కావ్యం రచించిన గొప్ప కవిగా మన మధ్యన ఉండడం మన అదృష్టమని వర్ణించారు.

రామచంద్ర ప్రభో! మకుటంతో ఆద్యంతం పద్యాలను ఎంతో శ్రావ్యంగా చదువుతూ బాబు దేవీ దాసు ని అభినందిస్తూ సమీక్ష చేశారు. డా . పొద్దుటూరు ఎల్లారెడ్డి రామ చంద్ర ప్రభో! మకుటం కలిగిన  131 పద్య కావ్యాన్ని  అక్కడక్కడ పద్యాలను ధారాళంగా  రమణీయంగా చదువుతూ రామ కథను ఆసాంతం పరిచయం చేశారు. డా.తంగెళ్ళ పల్లి శ్రీదేవి    చిత్రాంగద - సారంగధరుడు కథను కొత్తగా అలరిస్తూ 126 పద్యాల కృతినీ సమీక్ష చేస్తూ చిత్రాంగద విరహ తాపం  సారంగధరుని సహృదయాన్ని వివరించారు. మొహానికి ధర్మనిష్టకు మధ్య జరిగిన సంవాదంగా రంగి సారంగ ధర కథను అమో ఘ మని విశ్లేషించారు.

ఆత్మీయ అతిధులు అవధాని చుక్కాయిపల్లి శ్రీదేవి, డా. కే. బాలస్వామి, తెలంగాణ మహిళా సాహిత్య సాంస్కృతిక సంస్థ అధ్యక్షులు రావూరి వనజ  పద్యకృతులపై మాట్లాడుతూ అభినందన శుభాకాంక్షలు తెలిపారు. సభా సమన్వయ కర్తగా శ్రీమతి శాంతారెడ్డిగారు వ్యవహరించారు. జాతీయ సాహిత్య పరిషత్ జిల్లా పట్టణ శాఖ కార్యవర్గ సభ్యులు అభినందనలు తెలుపుతూ కవి శ్రీ బాబు దేవీదాస్ ని ఘనగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కవులు ప్రభులింగ శాస్త్రి, దేవదానం, రవీందర్ రెడ్డి,  ఖాజ మైనుద్దీన్, జగపతిరావు, గడ్డం వనజ, డా. క్రి ష్ణవేణి, జమున , ఈశ్వరమ్మ, గుముడాల చక్రవర్తి, శ్యామ్ ప్రసాద్ అనురాధ,  కవులు, విద్యార్థులు  సాహిత్యాభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని పుస్తకాల ఆ విష్కరణ సభను దిగ్విజయం చేశారని జిల్లా పట్టణ శాఖ అధ్యక్షులు విరివింటి వేంకటేశ్వరశర్మ , శాంతా రెడ్డిలు తెలిపారు.