26-12-2025 05:42:59 PM
నిర్మల్ జిల్లా
నిర్మల్,(విజయక్రాంతి): భారత రాజ్యాంగాన్ని రచించిన మీరు పాత్రికేయులకు న్యాయబద్ధంగా ఇచ్చే ఇళ్ల స్థలాలు ఇప్పించే దీవెన ఇవ్వాలని కోరుతూ నిర్మల్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో శుక్రవారం ఎన్టీఆర్ ట్యాంక్ బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పాత్రికేయులు వినతిపత్రం అందించారు. ఏళ్ల తరబడి ఇళ్లస్థలాల కోసం తాము పోరాటం చేస్తున్నామని తమకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని వారు వినతిపత్రంలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రాసం శ్రీధర్ లక్ష్మీనారాయణ పాత్రికేయులు ఉన్నారు