calender_icon.png 4 August, 2025 | 11:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రెసెక్ట్ జిల్లా సంఘం నూతన కమిటీ ఎన్నిక

04-08-2025 12:00:00 AM

అధ్యక్ష కార్యదర్శులుగా ధరావత్ రంజిత్, కోటా రవి 

భద్రాద్రి కొత్తగూడెం ఆగస్టు 3 (విజయక్రాంతి)ప్రోగ్రెసివ్ రేకగ్నైసేడ్ అసోసియేషన్ ఫర్ స్పె షల్ ఎడ్యుకేషన్ టీచర్స్ (పి ఆర్ ఏ ఎస్ ఇ టి) జిల్లా అధ్యక్షులుగా ధరావత్ రంజిత్, ప్రధాన కా ర్యదర్శిగా కోటా రవి ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పాల్వంచ  లో భద్రాద్రి కొత్తగూ డెం జిల్లా లో పనిచేస్తున్న ప్రత్యేక విద్య ఉపాధ్యాయుల సమావేశం జరిగింది.ఈ సమావేశం లో నూతన  సంగం ను ఎన్నుకున్నారు.

రాష్ట్ర పి ఆర్ ఏ ఎస్ ఇ టి అధ్యక్షులు జంగం సుమన్ ఆధ్వర్యంలో జిల్లా కమిటీనీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షులు గా -ధరావత్ రంజిత్, ప్రధాన కార్యదర్శిగా కోటా రవి, వర్కింగ్ ప్రెసిడెంట్  గా  సురేష్ బాబు,కోశాధికారి గా -రంజితజాదేవి, ఉపాధ్యక్షులు గా . ప్రణీత్ , సహాయ కార్యదర్శి గా--వీరేష్ ను ఎన్నుకున్నారు.ఈ కార్యక్రమంలో  ముఖ్య అతిథులుగా పిఆర్టియు జిల్లా అధ్యక్షులు నరసయ్య , పిఆర్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రభాకర్  , పి ఆర్ ఏ ఎస్ ఇ టి రాష్ట్ర సహాయ కార్యదర్శి గుండా నాగ రమేష్ తదితరులు పాల్గొన్నారు.

అధ్యక్షులు  మాట్లాడుతూ మీ సమస్యల పట్ల పీ.ఆర్ టీ యు అండగా ఉంటుందన్నారు. ఈ సంద ర్బంగా జిల్లా లోని ప్రత్యేక విద్య విద్యార్థుల అభ్యున్నతి కై పని చేయాలని భావించనైనది. ఈ కార్యక్రమం లో పి ఆర్ టి యు మహిళా అసోసియేట్ అధ్యక్షురాలు కళావతి , పలువురు మండ ల అధ్యక్షులు పాల్గొనడం జరిగినది  జిల్లాలోని స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్ పాల్గొన్నారు.