calender_icon.png 4 August, 2025 | 8:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సింగిల్ విండో మాజీ చైర్మన్ పెద్దన్న మృతి

04-08-2025 12:00:00 AM

బెల్లంపల్లి అర్బన్, ఆగస్టు 3 : బెల్లంపల్లి మండల కాంగ్రెస్ సీనియర్ నేత, చంద్రవెల్లి సింగిల్ విండో మాజీ చైర్మన్ సంగతి పెద్దన్న(92) కన్నుమూశారు. కొంతకాలంగా అనారో గ్యంతో మంచిర్యాల ఆసుపత్రి లో చికిత్స పొందుతున్నాడు. ఆదివారం ఆస్పత్రిలోనే తుదిశ్వాస విడిచారు. బెల్లంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గా పెద్దన్న గుర్తింపు పొందారు.

చంద్రవెల్లి కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ గా పని చేశారు. సింగరేణిలోనూ ఉద్యోగం  చేసి కార్మికులకు సేవలు అందించారు. సంగతి పెద్దన్న మర ణం కాంగ్రెస్ పార్టీకి, ప్రజలకు మరణం తీర ని లోటుగా కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నా రు. ఆయన మరణ వార్త తెలియగానే టీపీసీసీ  రాష్ట్ర ప్రచార కమిటీ కన్వీన ర్ నాతరి స్వామి, మున్సిపల్ మాజీ చైర్మన్ మత్తమరీ సూరిబా బు, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు తొంగల మల్లేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎండి అఫ్జల్, బెల్లంపల్లి మండల అధ్యక్షుడు సింగతి నారాయణ, మాజీ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ కారుకూరి రాంచందర్, కాంగ్రెస్ పార్టీ మైనార్టీ అధ్యక్షులు మొహమ్మద్ గౌస్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆడెపు మహేష్, దాసరి రాజలింగు, గుంపుల శంకర్, మాజీ కౌన్సిలర్ బైరి శ్రీనివాస్, రాచకొండ గోవర్ధన్ రావు, ఇందారపు లక్ష్మణ్ లు పెద్దన్న భౌతికయానికి శ్రద్ధాంజలి ఘటించారు. కుటుంబాన్ని పరామర్శించి సంతాపం తెలిపారు.