సహకార బ్యాంకు వైస్ చైర్మన్ ఎన్నిక
11-06-2024 12:09 AM
ఇబ్రహీంపట్నం, జూన్ 10: అబ్దుల్లాపూర్‌మెట్ మండలం తుర్కయం జాల్‌కి చెందిన డీసీసీబీ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య రాష్ట్ర సహకార బ్యాంకు వైస్ చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవ సాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరా వు, తాండూరు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యేలు మనోహర్ రెడ్డి, మల్‌రెడ్డి రంగారెడ్డి ఆయనను సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా సత్త య్య మాట్లాడుతూ.. రాష్ట్ర రైతాంగానికి సేవ చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు.






