calender_icon.png 29 July, 2025 | 1:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూతులు మానుకొని అభివృద్ధిపై దృష్టి పెట్టండి

28-07-2025 06:17:21 PM

జిల్లా కమిటీ సమావేశంలో జూలకంటి..

నల్గొండ టౌన్ (విజయక్రాంతి): ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం మానుకొని రాష్ట్ర అభివృద్ధి సంక్షేమంపై దృష్టి పెట్టాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి(Former MLA Julakanti Ranga Reddy) డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక దొడ్డి కొమరయ్య భవనంలో సిపిఎం జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారంలో ఉన్న పార్టీలతో పాటు ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు బూతు పురాణం సాగిస్తున్నారని విమర్శించారు. ప్రజా సమస్యలపై మాట్లాడకుండా గాలికి వదిలేసి వ్యక్తిగత దూషణలకు దిగడం సిగ్గుచేటు అన్నారు. అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని ప్రధానంగా అభివృద్ధి, సంక్షేమం అమలు కోసం ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. పాలకులు ప్రతిపక్షల పార్టీల నాయకుల తీరును చూస్తే ప్రజల అసహ్యించుకుంటున్నారని ధ్వజమెత్తారు.

ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నారని విమర్శించారు ప్రస్తుత పరిస్థితిలో అనేక ఇబ్బందులలో ప్రజలు ఉన్నారని వాటిని పరిష్కరించేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రధానంగా నాగార్జునసాగర్ ఎడమ కాలువ ఆయకట్టుకు సాగు నుండి విడుదల చేసేందుకు షెడ్యూల్ ను ప్రకటించాలన్నారు. నిరంతరంగా నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలని అన్నారు. రైతులకు అవసరమైన యూరియాను అందుబాటులో ఉంచాలని సూచించారు. రైతులకు బ్యాంకు రుణాలు, రుణమాఫీ వెంటనే చేపట్టాలని పేదలకు ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆరులైన వారందరికీ కొత్తగా పెన్షన్లు మంజూరు చేయాలని ఎన్నికల ముందు ఇచ్చిన ప్రకారం పెన్షన్ పెంచి ఇవ్వాలని కోరారు.

నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని పెండింగ్ ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయాలని కోరారు వ్యవసాయ ప్రణాళికను ప్రకటించాలన్నారు. జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనుల పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలన్నారు. కాలయాపన చేయకుండా స్థానిక సంస్థల ఎన్నికలను వెంటనే నిర్వహించాలని డిమాండ్ చేశారు. గ్రామస్థాయిలో పాలకులు లేకపోవడం వల్ల గ్రామాల అభివృద్ధి కొంటుపడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యుడు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి,నారి ఐలయ్య, డబ్బికార్ మల్లేష్, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పాలడుగు నాగార్జున, పాలడుగు ప్రభావతి, చినపాక లక్ష్మీనారాయణ, వీరేపల్లి వెంకటేశ్వర్లు, బండ శ్రీశైలం, సయ్యద్ హాశం తదితరులు పాల్గొన్నారు