calender_icon.png 29 July, 2025 | 1:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నగరంలో నీరు నిలవకుండా శాశ్వత చర్యలు తీసుకోవాలి

28-07-2025 05:45:32 PM

ప్రత్యేక అధికారి సర్ఫరాజ్ అహ్మద్...

కరీంనగర్ (విజయక్రాంతి): నగరంలో ఎక్కడ వర్షం నీరు నిలువకుండ శాశ్వత పరిష్కార చర్యలు చేపట్టాలని ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రత్యేక అధికారి సర్ఫరాజ్ అహ్మద్(District Special Officer Sarfaraz Ahmad) అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రత్యేక అధికారి సర్ఫరాజ్ అహ్మద్ నగరంలో పర్యటించి ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్లు, చౌరస్తాలపై వరద నీరు నిలిచిన ప్రాంతాలను సందర్శించారు. అదనపు కలెక్టర్ అశ్వినీ తానాజీ వాకిడే, నగరపాలక సంస్థ కమీషనర్ ప్రఫుల్ దేశాయ్, ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్, సానిటేషన్ అధికారులతో కలిసి నగరంలోని మంచిర్యాల చౌరస్తా, రాంనగర్, ఆర్టీసి వర్క్ షాప్ తదితర నీరు నిలిచిన ప్రాంతాలను తనిఖీ చేసి పరిశీలించారు.

వరద నీరు రోడ్లపై నిలవడానికి గల కారణాలను కమీషనర్, నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకొని సంబంధిత ప్రదేశాల్లో ఆర్ & బి డ్రైనేజీ కల్వర్టులను పరిశీలించారు. భారీ వర్షాల నేపథ్యంలో వరద నీరు నిలిచే చోట తీస్కోవల్సిన చర్యల అదనపు కలెక్టర్, కమీషనర్లతో చర్చించారు. వరద నీరు నిలువకుండ శాశ్వత పరిష్కారం కోసం తగిన చర్యలు తీస్కోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సంధర్బంగా ప్రత్యేక అధికారి సర్ఫరాజ్ అహ్మద్ మాట్లాడుతూ.... వర్షాలు కురిసే సమయంలో నీరు ప్రవహించే నాళాలను ఎప్పటికప్పుడు శుభ్రపరచాలని... డ్రైనేజీ ల్లో చెత్త చెదారంతో పాటు పేరుకు పోయిన సిల్టు ఉంటే తొలగించాలని అన్నారు.

వర్షాలతో నీరు నిలిచిన ప్రదేశాల్లో తాత్కాలికంగా కచ్చ నాళాల ద్వారా నీటిని డ్రైనేజీల్లోకి మల్లించాలని కోరారు. ఆర్ &బి శాఖను వారిని ఆదేశిస్తూ.... లేటర్ జారీ చేయాలని కమీషనర్ ను కోరారు. ఎక్కడెక్కడైతే ఆర్&బి శాఖ డ్రైనేజీలు కల్వర్టులు ఉన్నాయో అక్కడ వాటిని విస్తరించి అభివృద్ధి పనులు చేపట్టేలా చర్యలు తీస్కోవాలని అన్నారు. నగరపాలక సంస్థ పరిదిలోకి వచ్చే డ్రైనేజీలు ఏమున్నా వాటి మరమ్మతులు చేపట్టి, ఆర్ &బి శాఖ వారితో కల్వర్టులు ప్రణాళిక ప్రకారం నిర్మాణం చేసేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. నగరపాలక సంస్థ, ఆర్ &బి అధికారుల సమన్వయంతో వరద నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చేయాలని ఆదేశించారు. నగర పారిశుధ్య పనులను మెరుగ్గా చేయాలని.... డ్రైనేజీల్లో సిల్టును తొలగించాలని కోరారు. వరద నీటితో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో మహేశ్వర్, ఈఈ యాదగిరి, డీఈ లచ్చిరెడ్డి, ఏసిపి శ్రీధర్, డిఆర్ఎఫ్, సానిటేషన్ సిబ్బంది పాల్గొన్నారు.