calender_icon.png 21 August, 2025 | 5:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా మద్దెలమ్మ బోనాలు

21-08-2025 02:59:40 PM

హాజరైన ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి

వలిగొండ,(విజయక్రాంతి): వలిగొండ మండల కేంద్రంలో గురువారం పద్మశాలి సంఘం అధ్యక్షుడు ఐటీపాముల రవీంద్ర ఆధ్వర్యంలో పద్మశాలి కులస్తులు వారి కులదైవమైన మద్దెలమ్మకు ఘనంగా బోనాలు సమర్పించారు. ఈ బోనాలు ఉత్సవంలో ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి(MLA anil kumar reddy ) పాల్గొనగా ఆయనను రవీంద్ర శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా మహిళలు బోనాలను పసుపు, కుంకుమలతో, వేపకొమ్మలతో అందంగా అలంకరించి నెత్తిన ఎత్తుకొని శివసత్తుల పూనకాలతో, పోతరాజు విన్యాసాలతో బోనాలు సమర్పించేందుకు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా మహిళలు బోనాలతో తరలి వెళుతుండగా పురుషులు డిజె సాంగ్ లతో ఆనందోత్సవాలతో నృత్యాలు చేశారు. ఈ కార్యక్రమంలో కుమార్, శ్రీనివాస్, వెంకటేశం, అరుణ్, జగన్, భాస్కర్, శ్యాంసుందర్ తదితరులు పాల్గొన్నారు.