5 May, 2026 | 2:02 AM

ఖేడ్‌లో మున్సిపల్ కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక

05-05-2026 12:35 AM

నారాయణఖేడ్, మే 4: నారాయణఖేడ్ మున్సిపల్ పరిధిలోని కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక  సోమవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నిక కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ పి.సంజీవరెడ్డి, మున్సిపల్ చైర్మన్ నగేష్ షట్కా ర్, మున్సిపల్ కమిషనర్ వి.ప్రశాంతి పాల్గొన్నారు. మొత్తం నాలుగు కో ఆప్షన్ సభ్యులకు గాను నలుగురిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ఇందులో మైనార్టీ విభాగం నుండి మొహమ్మద్ అబ్దుల్ ఖయ్యూం అలియాస్ ముంతాజ్ సేట్, అర్పిన్ సుల్తాన మహమ్మద్ అబ్దుల్ మోహిజ్, నర్సు గొండ, శేట్టి రేష్మ శంకర్  ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మున్సిపల్ అభివృద్ధికి కో ఆప్షన్ సభ్యులు తగిన సూచనలు సలహాలు అందించాలని సూచించారు. ఎన్నిక కాబడిన సభ్యులను సన్మానించి అభినందించారు. కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.