పోచమ్మ ఆలయానికి శంకుస్థాపన
రూ.10 లక్షల సొంత నిధులు ఇచ్చిన గోవర్ధన్‌రెడ్డి
హాజరైన ఎమ్మెల్యే మహిల్ రెడ్డి
గుమ్మడిదల, మే 4 : గుమ్మడిదల మున్సిపాలిటీ 15వ వార్డు పరిధిలోని అంబేద్కర్ కాలనీలో పోచమ్మ తల్లి దేవాలయ నిర్మాణానికి సోమవారం శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. సిజిఆర్ ట్రస్ట్ చైర్మన్, బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి తన ట్రస్ట్ ద్వారా సొంత నిధులతో దేవాలయం నిర్మిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి నిర్మాణ పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దేవాలయాల నిర్మాణం ఆధ్యాత్మికతతో పాటు సమాజంలో ఐక్యతను పెంపొందిస్తుందని అన్నారు. కాలనీ వాసుల భక్తి విశ్వాసాలకు అనుగుణంగా, సుమారు పది లక్షల రూపాయల సొంత నిధులతో ఆలయ నిర్మాణ బాధ్యతను స్వీకరించిన సిజిఆర్ ట్రస్ట్ చైర్మన్ చిమ్ముల గోవర్ధన్ రెడ్డిని ప్రత్యేకంగా అభినందించారు. చిమ్ముల గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. స్థానిక ప్రజల అభీష్టం మేరకు ఆలయ నిర్మాణానికి పది లక్షల రూపాయలు వెచ్చిస్తున్నట్లు తెలిపారు.
భవిష్యత్తులో ట్రస్ట్ ద్వారా మరిన్ని అభివృద్ధి, సేవా కార్యక్రమాలకు సహకారం అందిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కుమార్ గౌడ్, వైస్ ఛైర్మన్ సంధ్యారెడ్డి,కౌన్సిలర్లు మాజీ సర్పంచ్ నరసింహారెడ్డి, దేవాలయ కమిటీ అధ్యక్షులు మద్దుల బాల్రెడ్డి,నాయకులు హుస్సేన్, వెంకట్ రామ్ రెడ్డి, పొన్నాల శ్రీనివాస్ రెడ్డి, సత్యనారాయణ, వెంకటేష్ గౌడ్, తుపాకుల రాజు, శేఖర్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, అంబేద్కర్ సంఘం సభ్యులు రామచంద్రయ్య, డప్పు శ్రీను, రాజు, సుధాకర్, బాలేష్, రాజు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.






