7 July, 2026 | 5:20 AM

గీత పనివారల సంఘం నూతన కమిటీ ఎన్నిక

04-08-2025 01:11 PM

అధ్యక్షులుగా వీరమళ్ల యాదయ్య, కార్యదర్శిగా సురిగి శ్రీశైలం

సంస్థాన్ నారాయణపూర్,(విజయక్రాంతి): సంస్థాన్ నారాయణపూర్ మండల కేంద్రంలో గీత పనివారాల సంఘం నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా వీరమళ్ళ యాదయ్య, కార్యదర్శిగా సురిగి శ్రీశైలం, ఉపాధ్యక్షులుగా పాలకూర్ల స్వామి, కార్యవర్గ సభ్యులుగా బద్దం భిక్షం, బత్తిని మల్లేశం, బొడిగె యాదయ్య, బొంగు బిక్షమయ్య, పట్నం గాలయ్య, పాలకూర్ల జంగయ్య లను ఎన్నుకున్నారు.

నారాయణపురం సొసైటీలో జరిగిన సమావేశానికి యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి పందుల యాదగిరి హాజరై మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కల్తీకల్లు పేరిట కల్లు సొసైటీలను రద్దు చేసే కుట్ర జరుగుతుందని, కల్తీకల్లు చేసే వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని కమిటీలను రద్దు చేస్తే చర్యలను విరమించుకోవాలని అన్నారు. రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ఎక్స్ గ్రేషియాలను వెంటనే చెల్లించాలని, అర్హులైన గీత కార్మికులకు వృత్తి పెన్షన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం నూతన సొసైటీ కమిటీని ప్రకటించారు.