04-08-2025 01:14:16 PM
నంగునూరు: నంగునూరు మండలం గట్లమల్యాల గ్రామ పంచాయతీ సిబ్బంది తిరుపతి తండ్రి పుల్లూరి రాజయ్య ఆదివారం అనారోగ్యం తో మరణించారు. ఎమ్మెల్యే హరీష్ రావు ఆదేశాల మేరకు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఎడ్ల సోమిరెడ్డి బాధిత కుటుంబాన్ని సోమవారం పరామర్శించి రూ.5వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. కుటుంబానికి అండగా ఉంటామని భరోస ఇచ్చారు. అనంతరం గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న బొమ్మ వెంకయ్యను కలిసి ఆరోగ్య పరిస్థితినీ అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ఉపాధ్యక్షులు వేణుగోపాల చారి, మాజీ సర్పంచ్ వీర నాయక్, నాయకులు మాధవరెడ్డి, ఎర్రబాబు, తిరుపతి, కృష్ణమూర్తి, పరశురాములు, ప్రవీణ్, విజయ్, రవి తదితరులు ఉన్నారు.