20 August, 2026 | 4:04 AM

పోలీస్ అధికారుల సంఘం నూతన కమిటీ ఎన్నిక

20-08-2026 12:00 AM

మహబూబాబాద్, ఆగస్టు 19 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా పోలీస్ అధికారుల సంఘం 2026 నూతన కమిటీ ఎన్నికలు నిర్వహించారు. అధ్యక్షునిగా ఎస్. చంద్రశేఖర్, ఉపాధ్యక్షులు బి. సోములు, బి. వెంకన్న, కార్యదర్శిగా జి. శేఖర్, సంయుక్త కార్యదర్శిగా బి. రామయ్య, ఆర్గనైజింగ్ సెక్రటరీగా డి. అనిల్, కోశాధికారిగా ఎల్. మంగీలాల్, కార్యవర్గ సభ్యులు సుప్రజ, సురేష్, నాగమణి, ఈ. సురేష్, యాకన్నా గౌడ్ ఎన్నికయ్యారు. నూతన కమిటీ ప్రతినిధి వర్గం జిల్లా ఎస్పీ డాక్టర్ శబరిష్ ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.