calender_icon.png 4 July, 2025 | 12:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి నూతన మండల కమిటీ ఎన్నిక

03-07-2025 04:28:28 PM

చిలుకూరు: చిలుకూరు మండలం ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి నూతన కమిటీని గురువారం. చిలుకూరు మండల ఇంచార్జ్ కొండపల్లి ఆంజనేయులు అధ్యక్షతన ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సూర్యాపేట జిల్లా ఇంచార్జ్ బచ్చలకూరి వెంకటేశ్వర్లు(District Incharge Bachalakuri Venkateswarlu) పాల్గొని మాట్లాడుతూ... ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు సూర్యాపేట జిల్లాలోని అన్ని నియోజకవర్గాలు అన్ని మండలాల్లోని నూతన కమిటీలను వేయడం జరుగుతుందని, దానిలో భాగంగా గురువారం చిలుకూరు మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి మండల కమిటీ వేయడం జరిగిందని, ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులుగా మల్లెపంగు సూరిబాబుని ఏకగ్రీవంగా మూడోసారి ఎన్నుకోవడం జరిగిందని, ఎంఎస్పి, మండల అధ్యక్షులుగా మాతంగి వీరస్వామి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని, కమిటీ సభ్యులుగా ఎమ్మార్పీఎస్, అధికార ప్రతినిధి, గద్దల వీరబాబు, ఉపాధ్యక్షులుగా మాతంగి సైదులు, ఎంఎస్పి అధికార ప్రతినిధిగా మల్లెపంగు ఉపేందర్, ప్రధాన కార్యదర్శిగా బొడ్డు పల్లి, భిక్షంలను ఎన్నుకోవడం జరిగిందని ఆయన అన్నారు.

ఈ కమిటీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు పనిచేసుకుంటూ పోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కోదాడ నియోజకవర్గం ఇంచార్జ్ ఏపూరి రాజు, ఎంఎస్పి రాష్ట్ర నాయకులు వడ్డేపల్లి కోటేష్, ఎమ్మార్పీఎస్ జిల్లా అధికార ప్రతినిధి ఏపూరి సత్యరాజు, ఎం, ఎస్, ఎఫ్, జిల్లా ఇన్చార్జి మల్లెల సుధాకర్, జిల్లా ఉపాధ్యక్షులు సిద్దెల శ్రీను, ఎం, జె, ఎఫ్, మండల అధ్యక్షులు కందుకూరి కృష్ణమూర్తి, ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు మొలుగూరి, నాగరాజు, మల్లెపంగు, శోభన్, నెమ్మది, సైదా బాబు, అన్ని గ్రామాల అధ్యక్షులు, కార్యదర్శులు ఎమ్మార్పీఎస్, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.