03-07-2025 03:09:32 PM
-బిఎస్పి జిల్లా అధ్యక్షులు రాజేంద్రప్రసాద్-
మందమర్రి,(విజయక్రాంతి): త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో(Local Body Elections) జిల్లావ్యాప్తంగా అన్ని మండలాల్లో బీఎస్పీ(Bahujan Samaj Party) బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించేలా నాయకులు, కార్యకర్తలు, కృషి చేయాలని బీఎస్పీ జిల్లా అధ్యక్షులు ముల్కల రాజేంద్రప్రసాద్ కోరారు. పట్టణంలోని పాత బస్టాండ్ లో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పట్టణానికి చెందిన పలువురు బిఎస్పీలో చేరగా వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న జెడ్పిటిసి ఎంపీటీసీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతామని ఆయన స్పష్టం చేశారు. జిల్లా పరిషత్ ఎన్నికల్లో బిఎస్పి కీలకంగా మారుతుందని ఆయన ఆశా భావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో బిఎస్పీ పట్టణ అధ్యక్షులు గాజుల శంకర్, మండల అధ్యక్షులు మతీన్ ఖాన్, షేక్ రహీం బాబా, ఎస్ కే వాజీద్, షేక్ సర్ఫ్ అలం లు పాల్గొన్నారు.