19-05-2025 10:48:00 PM
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): బీసీ సంక్షేమ సంఘ యువజన విభాగం(BC Welfare Association Youth Department) జిల్లా అధ్యక్షుడిగా మామిడి కిరణ్ ను సోమవారం జిల్లా కేంద్రంలోని సంఘ భవనంలో జిల్లా అధ్యక్షుడు రూపనార్ రమేష్ ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. ఈ సందర్బంగా నూతనంగా ఎన్నికైన కిరణ్ మాట్లాడుతూ.. తన నమ్మకం ఉంచి జిల్లా యూవజన విభాగపు అధ్యక్షునిగా నియమించినందుకు కృతజ్ఞతలు తెలిపుతూ సంఘ బాధ్యతలు నిర్వహిస్తానని తెలిపారు. నూతనంగా ఎన్నికైన అధ్యక్షుని పలువురు సన్మానించారు.