19-05-2025 10:53:49 PM
బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): బెల్లంపల్లి కూరగాయల మార్కెట్ షాపుల కేటాయింపులో అవకతవకలు జరిగాయని కొందరు వ్యాపారులు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్(District Collector Kumar Deepak)కి సోమవారం ఫిర్యాదు చేశారు. ఇటీవలనే మున్సిపల్ కార్యాలయంలో షాపుల కేటాయింపుపై కలెక్టర్ సమక్షంలో లక్కీ డ్రా తో కేటాయించిన విషయం తెలిసిందే. కాగా అర్హులకు షాపులు దక్కలేదన్న ఆరోపణలు కొంతమంది వ్యాపారస్తులు వ్యక్తం చేస్తున్నారు. ఇదే క్రమంలో ప్రజా ఫిర్యాదులో జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.
అర్హులైన వ్యాపారస్తులకు షాపులు కేటాయించాలని జిల్లా కలెక్టర్‌కు మొరపెట్టుకున్నారు. సంబంధం లేని వ్యక్తులకు షాపులు, సెట్టర్లు కేటాయించారని తెలిపారు. షాపుల కేటాయింపు వెనక పెద్ద ఎత్తున ముడుపులు అవినీతి వ్యవహారం ఉందని కలెక్టర్ దృష్టికి వ్యాపారులు తీసుకువెళ్లారు. షాపుల కేటాయింపులో అవకతవకను సహించేది లేదని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ వ్యాపార వ్యాపారస్తులకు హామీ ఇచ్చారు. వ్యాపారస్తుల ఫిర్యాదును పరిగణంలోకి తీసుకొని విచారణ చేస్తానని హామీ ఇచ్చినట్టు ఫిర్యాదుదారులు తెలిపారు.