09-11-2025 05:29:49 PM
హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్(Election Officer RV Karnan) మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... జూబ్లీహిల్స్ ఉపఎన్నిక(Jubilee Hills by-election)కు అన్ని ఏర్పాట్లు సిద్దం చేశామని పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల బరిలో 58 మంది అభ్యర్థులు ఉన్నారని, అలాగే జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో 4 బ్యాలెట్ యూనిట్లు ఉంటాయని తెలిపారు. రేపు కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి స్టేడియంలో ఎన్నికల సామగ్రి పంపిణీ చేస్తామని.. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం 407 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని ఆర్వీ కర్ణన్ వెల్లడించారు. అన్ని పోలింగ్ స్టేషన్లలో వెబ్ కాస్టింగ్ ఉంటుందని.. ఈసారి కొత్తగా 139 ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా పర్యవేక్షణ, పటిష్టమైనా నిఘా ఉంటుందని తెలిపారు.
అలాగే జీహెచ్ఎంసీ కేంద్ర కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు. అటు, జూబ్లీహిల్స్ లో ఉపఎన్నికల ప్రచారం ముగిసింది. ఇంటింటి ప్రచారం మినహా ఏ రకమైనా ప్రచారం చేయకూడదని, బల్క్ మెసేజ్ లు, సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారాలపై నిషేధం విధించారు. ఎల్లుండి(మంగళవారం) జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్.. 14న ఫలితాలు ఉండనున్నాయి. 11న సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ఉంటుందన్నారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల బరిలో మాగంటి సునీత(బీఆర్ఎస్), నవీన్ యాదవ్(కాంగ్రెస్), దీపక్ రెడ్డి(బీజేపీ) ఉన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం 4,01,365 మంది ఓటర్లు ఉన్నారు.