calender_icon.png 9 November, 2025 | 7:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నీట మునిగి వ్యక్తి మృతి..

09-11-2025 05:32:22 PM

కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లి నీట మునిగి ఉంటాడని పోలీసుల అనుమానం

పాపన్నపేట (విజయక్రాంతి): నీట మునిగి వ్యక్తి మృతి చెందిన సంఘటన ఏడుపాయలోని చెక్ డ్యాం సమీపంలో చోటు చేసుకుంది. ఎస్సై శ్రీనివాస్ గౌడ్ కథనం మేరకు.. మండల పరిధి నార్సింగి గ్రామానికి చెందిన వడ్ల మహేష్(33) గ్రామానికి చెందిన నర్సింలు అనే స్నేహితుడితో కలిసి గత బుధవారం కార్తిక పౌర్ణమి సందర్భంగా ఏడుపాయల ఆలయానికి వెళ్లారు. అక్కడి నుంచి మహేష్ హైదరాబాద్ లో బంధువుల ఇంటికి వెళ్తానని చెప్పడంతో నర్సింలు ఒక్కడే తిరిగి గ్రామానికి వెళ్లాడు.

కాగా మరుసటి రోజు బంధువులకు వాకబు చేయగా మహేష్ తన వద్దకు రాలేదని చెప్పారు. దీంతో గ్రామంతో పాటు పరిసర ప్రాంతాల్లో ఆచూకీ కోసం గాలించారు. శనివారం ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో శనివారం రాత్రి ఏడుపాయల చెక్ డ్యాం సమీపంలో నీటిలో తెలియాడుతున్న యువకుడి మృతదేహం స్థానికులకు కనిపించింది. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఆనవాళ్లను బట్టి మృతి చెందింది మహేష్ గా నిర్ధారించారు. కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లి ప్రమాదవశాత్తూ నీట మునిగి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడి తల్లి వజ్రమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.