11 July, 2026 | 1:52 AM

డిస్నీల్యాండ్ హైస్కూల్‌లో ఎన్నికలు

11-07-2026 12:00 AM

విద్యార్థులకు ఎన్నికల ప్రక్రియపై అవగాహన

హైదరాబాద్, జూలై 10 (విజయక్రాంతి): దామెర మండలం ఒగ్లాపూర్ పరిధిలోని డి స్నీల్యాండ్ విద్యాలయంలో శుక్రవారం విద్యా క్యాలెండర్‌లో భాగంగా విద్యార్థులకు నమూనా ఎన్నికలను పాఠశాల యాజమా న్యం సలహా మేరకు సోషల్ స్టడీస్ ఉపాధ్యాయ బృందం నిర్వహించింది. ఈ ఎన్నిక లు ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికల నియమావళిని ఖచ్చితంగా పాటిస్తూ నిర్వహించారు.

విద్యార్థులు, ఉపాధ్యాయులు సుమారు 850 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. బాలికల విభాగంలో స్కూల్ పుపిల్ లీడర్‌గా బుద్దె శ్రీహర్ష తన స మీప అభ్యర్థి మూడు కీర్తనపై 80 ఓట్ల తేడా తో, బాలుర విభాగంలో తొర్రూర్ హేమంత్ ౧౦వ తరగతి తన సమీప ప్రత్యర్థి దాసరి చరణ్ కుమార్‌పై కేవలం మూడు ఓట్ల తేడా తో విజయాన్ని సాధించారు. డిప్యూటీ స్కూ ల్ పుపిల్ లీడర్‌గా బాలుర విభాగంలో అజ్మీ ర సిద్ధార్థ 9వ తరగతి తన సమీప అభ్య ర్థి కావటి సాయి తేజపై 147 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందాడు.

బాలికల విభాగంలో అలుగోజు అద్విత 9వ తరగతి తన సమీప అభ్యర్థి తెప్పల శాన్వి పై 24 ఓట్ల తేడాతో విజయా న్ని సాధించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల వ్యవస్థాపకులు డీ మల్లయ్య, డీ సదయ్య, బాలుగు లక్ష్మీనివాసం, కరస్పాండెంట్ బి.శోభారాణి, డైరెక్టర్లు డి.రాకేష్ భాను, డి. దినేష్ చందర్, డాక్టర్ బి.పవన్, టీజీబీ బ్యాంక్ మేనేజర్ భానుచందర్, కావ్య, మీనా ఆద్యంతం దగ్గరుండి ఈ నమూనా ఎన్నికలను పరిశీలించారు. సాంఘికశాస్త్రం ఉపాధ్యాయులు రతన్ సింగ్, రాజ్ కుమార్, పాషా, నరేష్ కుమార్‌ను యాజమాన్యం అభినందించింది.