14-07-2025 01:15:40 AM
- ఛతీస్‌గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, గిరిజన ప్రాంతాలతో పాటు భద్రాచలం నియోజకవర్గం అభివృద్ధికి ముఖద్వారం
- భద్రాద్రి రామ దర్శనానికి మార్గంగా మారిన భద్రాచలం గోదావరి బ్రిడ్జి
భద్రాచలం, జులై 13 (విజయ క్రాంతి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గో దావరిపై నిర్మించిన వంతెనకు 60 ఏళ్ళు నిండాయి. గోదావరి నదిపై ఏర్పాటు చేసిన గోదావరి బ్రిడ్జి 1965 జూలై 13న అప్పటి రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ వంత నిర్మా ణం నీ ప్రారంభించారు. బ్రిడ్జి నిర్మాణం వల్ల భద్రాచలం రామ దర్శనానికి వచ్చే భక్తులతో పాటు, ఒరిస్సా, ఛత్తీస్గడ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు వెళ్లే ప్రయాణికులకు వాహనాలకు ప్ర ధాన రహదారిగా మారింది.
గతంలో పూర్తి దట్టమైన అడవి ప్రాంతంగా ఉన్న ఈ ప్రాం తాలు భద్రాచలం బ్రిడ్జి నిర్మాణంతో బాహ్య ప్రపంచంతో సంబంధాలు ఏర్పాటు చేసుకుని ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధిలో ముం దంజలో ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దీని నిర్మాణం చేపట్టగా ఈ బ్రిడ్జి ద్వారా ప్రతిరోజు వేలాది వాహనాలు భద్రాచలం మీద నుండి ఆయా రాష్ట్రాలకు వెళ్తూ తెలంగాణ తో పాటు సరిహద్దు రాష్ట్రాలు కూడా అభివృద్ధిని సాధించాయి.
ఆయా ప్రాంతాల ప్ర జలు హైదరాబాద్, విజయవాడ తో పాటు దేశంలోని పలు ప్రాంతాలకు వెళ్లాలంటే ఒక భద్రాచలం బ్రిడ్జియే ప్రధాన రహదార అ యింది. ఈ బ్రిడ్జి శంకుస్థాపనను 1959 డి సెంబర్ 6న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి శంకుస్థాపన చేయ గా,5 సంవత్సరాల లలో నిర్మాణం పూర్తి చేసుకొని 1965 జూలై 13 వ తేదీన అప్పటి దేశ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ ప్రారంభించారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బాగా వెనుకబడిన భద్రాచలం ప్రాంతంలో వేంచేసియున్న శ్రీ సీతారామచంద్రస్వామి దర్శనా నికి రావాలంటే అనేక కష్టాలు ఎదురయ్యా యి. వాహనాల రాకపోకలు సరిగ్గా లేక.. మ ధ్యలో గోదావరి దాటాలంటే ప్రాణాలకు తె గిం చాల్సి వచ్చేది.
ఏటా శ్రీరామనవమి, ముక్కోటి ఉత్సవాలకు వచ్చే భక్తులు భద్రాచలం గోదావరి అవతల ఒడ్డున గల బూ ర్గంపాడు మండలం గొమ్మూరు వచ్చి అక్క డి నుండి ఎండాకాలంలో కాలినడకన, ఇతర సమయాలలో పడవలో ప్రయాణించేవారు. శ్రీరామ నవమికి జంట పడవల మీద వ స్తున్న 150 మంది భక్తులు ఒకసారి నీట ము నగడంతో.. వారధి నిర్మాణం ఆవశ్యకతను అప్పటి పాలకులు గుర్తించారు.1959లో శ్రీ రామనవమి రోజున భద్రాద్రి రామయ్య క ళ్యాణం తిలకించడానికి జంట పడవల ద్వా రా గోదావరి నది దాటే ప్రయత్నంలో ప్ర మాదం జరిగి రెండు పడవలు మునిగిపో యి ప్రాణ నష్టం ఎక్కువగా జరిగింది.దీంతో స్పందించిన నాటిఉమ్మడి ఏపీ ప్రభుత్వం గోదావరి నదిపై వంతెననిర్మాణానికి శ్రీకా రం చుట్టింది.
నాటి ముఖ్యమంత్రి నీలం సం జీవరెడ్డి శంకుస్థాపన చేయగా 1965లో రా ష్ట్రపతి రాధాకృష్ణ ప్రారంభించారు. గోదావ రి బ్రిడ్జి డిజైన్, నిర్మాణ పర్యవేక్షణ బాధ్యతలను ముంబైకి చెందిన పటేల్ ఇంజనీరింగ్ కంపెనీకి అప్పగించగా 70 లక్షలతో నిర్మా ణం చేపట్టి పూర్తి చేశారు. భద్రాచలం వద్ద గోదావరి నదిపై వంతెన నిర్మించిన బ్రిడ్జి 3,94 ఆడుగుల పొడవు. 87 పిల్లర్లు, ఒక్కొ క్క పిల్లర్ మధ్య 106.6 అడుగుల దూరంతో.. ముంబైకి చెం దిన పటేల్ ఇంజనీరింగ్ కంపెనీ ఆధ్వర్యాన నిర్మిం చారు.
ఈ వంతెనపై ఇన్నాళ్లూ లక్షలాది వాహనాల రాకపోకలు సాగినా ఇప్పటికీ పటిష్టంగా ఉండటం విశేషం.భద్రాచలం వద్ద గోదావరి నదికి ఎంత ఉధృతంగా వరదలు వచ్చినప్పటికీ అన్ని వరదలను తట్టుకొని ఉండటం వి శేషం. 1986లో గోదావరి నదికి అత్యధిక వరద 75. 6 అడుగులు వచ్చినప్పటికీ ఆ స మయంలో బ్రిడ్జి రెండు వైపులా అప్రోచ్ రోడ్లు మునిగిపోయినప్పటికీ బ్రిడ్జి మాత్రం చెక్కుచెదరలేదు. అయితే రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని పురస్కరించుకొని ఉ న్న బ్రిడ్జి పక్కనే మరో బ్రిడ్జిని మంజూరు చేసి గత సంవత్సరం నిర్మాణం పూర్తి చేశారు.